సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌కు.. ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. దీని నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు. మనశ్శాంతి కోసం సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు. అక్కడ కాంట్రాక్టర్లు బిల్లుల కోసం.. తిప్పలు పెట్టారు. ఇక, తర్వాత.. బెంగళూరు వెళ్లారు. అక్కడ కూడా.. మనసు స్థిరంగా లేదు. అయినా.. అక్కడే ఉండి తాజాగా 1వ తారీకు.. తాడేపల్లికి వచ్చారు. గతంలో మాదిరిగా ఆయనకు ఘన స్వాగతాలు దక్కలేదు. నాయకులు క్యూలో నిలబడి బొకేలు కూడా ఇవ్వలేదు. ఇదొక షాక్.
మరోవైపు.. ప్రభుత్వం పరంగా..సీఎం చంద్రబాబు మరో భారీ షాక్ ఇచ్చారు. అసలు ఇవ్వరు.. పెంచేయడం అయితే.. పెంచేస్తారు. ఇంటికి కిలో బంగారం కూడా ఇస్తామని చెబుతారని ఎన్నికలకు ముందు చంద్రబాబుపై తీవ్ర ప్రచారం చేసిన.. జగన్‌కు షాకిస్తూ.. 1వ తేదీ.. పెంచిన పింఛనును.. బకాయిలతో కలిపి ఏకంగా 4 వేల కోట్ల రూపాయలకు పైగా.. లబ్ధిదారులకు చంద్రబాబు పంపిణీ చేశారు. దీంతో జగన్ మాటల డొల్లతనాన్నిఆయన ఎండగట్టినట్టయింది.
ఇదేసమయంలో కేవలం వలంటీర్లు మాత్రమే చేయగలర్న ఈ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో చేయించిన.. చంద్రబాబు రాత్రి 10 గంటల సమయానికి 96 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేయడం పూర్తి చేయించారు. ప్రతి గంటకూ మానిటరింగ్ చేశారు. ఫలితంగా.. పింఛన్ల పంపిణీలో వలంటీర్లు లేకపో యినా.. ఇంటింటికీ తిరిగి ఇవ్వొచ్చని చంద్రబాబు నిరూపించారు. ఇది మరింత షాక్. నిజానికి చంద్రబాబు సర్కారు ఏర్పడి 18 రోజులు అయింది. ఫలితాలు వచ్చి 26 రోజులు అయింది.
ఇంతలోనే.. 4 వేల కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేయడం అంటే.. తొలి విజయం చంద్రబాబు దక్కించుకున్నట్టు అయింది. అంతేకాదు.. ఊరూవాడా కూడా.. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ పరిణామం.. వైసీపీకి మరింత ఇబ్బందిగా మారింది. సంక్షేమం అంటే.. తమవల్లే సాధ్యమవుతుందని.. తమకే పేటెంట్ ఉందని.. చెప్పుకొన్న జగన్‌కు.. ఇప్పుడు నోట మాటరాకుండా.. మాట్లాడేందుకు ఏమీ లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ఫస్ట్ స్టెప్‌లోనే జగన్ కు బాబు భారీ షాక్ ఇచ్చారని అంటున్నారు.
This post was last modified on %s = human-readable time difference 3:03 pm
నిన్న జరిగిన లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీని ఉద్దేశించి దిల్ రాజు ఒక మాటన్నారు. తనను…
నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్…
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…