మాటకు మాట… సోషల్ మీడియా ప్రభావం రాజకీయాలపై ఎక్కువగానే ఉంది. నాయకులు చేసే వ్యాఖ్యలు ఇట్టే వైరల్ అవుతుండడం ఒక ఎత్తయితే.. నాయకులు చేసే వ్యాఖ్యలపై మేదావులు, సాధారణ ప్రజలు కూడా అంతే వేగంగా రియాక్ట్ అవుతున్నారు. వారు రాజకీయ నేతలే కానవసరం లేదు..బుద్ధి జీవులు కావొచ్చు. వారు తలలు పండిన నేతాశ్రీలే కాకపోవచ్చు.. రాజకీయాల పై అవగాహన ఉన్నవారు. దీంతో కొందరు నేతలు చేసే కామెంట్లకు నెటిజన్లు కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స నారాయణ చేసిన వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు మాటకు-మాట అన్నట్టు రియాక్ట్ అయ్యారు. అవేంటంటే!
బొత్స: రాష్ట్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉంది. మా పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు.
నెటిజన్: ఎంత మాట.. ఎంత మాట.. జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు ఇంటిపై దండెత్తిన విషయం మరిచిపోయారా? లేళ్ల అప్పిరెడ్డి బృందం .. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపైకి ఎగబడి.. కుప్పిగంతులువేసిన విషయం మరిచారా? బొత్సగారూ! అయినా.. వాళ్లు మూడేళ్లు మీ బాధలు పడ్డారు. కొట్టించుకున్నారు. కేసులు పెట్టించుకున్నారు. మీరు 20 రోజులకే అల్లాడిపోతే ఎలా?
బొత్స: నిబంధనలకు లోబడే వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
నెటిజన్: అయితే.. అనుమతుల పత్రాలను మీరే బయటకు ఎందుకు పెట్టకూడదు.? నిబంధనలకు విరుద్ధం కాకపోతే.. తాడేపల్లిలోని చెరువును ఎలా ఆక్రమించారు. రుషి కొండను బోడిగుండు చేసి.. ఇంద్రభవనాన్ని ఎలా నిర్మించారు. మరిచిపోతే ఎలా సర్!!
బొత్స: యూనివర్సిటీల్లో వీసీలపైనా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీసీలను నామినేట్ చేయడం అనేది ఒక విధానం.
నెటిజన్: అసలు వీసీలపై దౌర్జన్యాలు మొదలైందే.. 2020లో సర్. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వీసీ.. ఏపీపీఎస్సీ చైర్మన్ వంటివారిని రాత్రికిరాత్రి బెదిరించి పంపేయలేదా? గుర్తు చేసుకోండి.
బొత్స: విద్యాశాఖలో నాపై వచ్చిన ఆరోపణలు పట్ల స్పందించాల్సిన అవసరం లేదు.
నెటిజన్: మీపై వచ్చిన ఆరోపణలకు స్పందించరు. పాలన బాగోలేదన్నా.. స్పందించరు.. అందుకే ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాలో స్పందించేశారు సర్. ఇప్పుడు మీరు స్పందించినా.. వేస్టేనేమో.. బెస్ట్ డెసిషన్!!
బొత్స: కొందరు రిటైర్డ్ ఐఏఎస్‌లు(ఎల్వీ సుబ్రహ్మణ్యం) నాటి జగన్ ప్రభుత్వం గురించి ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా!?
నెటిజన్: హమ్మో.. మాట్లాడితే బతకనిస్తారా? ఏం చెబుతున్నారండీ. అప్పుడు మాట్లాడలేకే.. ఇప్పుడు నోరు విప్పుతున్నారు. కొంత ఓర్పు వహించండి బొత్ససర్!!
This post was last modified on July 1, 2024 9:53 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…