కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటిషియన్ తో కలిసి పనిచేయడం సంతోషకరమని ప్రధాని మోడీ కూడా పలు సందర్భాల్లో అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాలలో కూడా చంద్రబాబుకు మోడీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తన పక్కనే చంద్రబాబును కూర్చోబెట్టుకొని ఆయనకు ఎంత గౌరవమిస్తున్నానో చెప్పారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబుపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని మోడీ మరోసారి చాటి చెప్పారు. తాజాగా ‘మన్ కీ బాత్’ సందర్భంగా 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకులో కాఫీ తాగుతున్న ఫొటోల గురించి ప్రస్తావించారు. తాను అరకు కాఫీకి అభిమానిని అని, 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో మోడీ పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ ఫొటోలపై సీఎం చంద్రబాబు స్పందించారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను మోడీగారు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తమ గిరిజన సోదరసోదరీమణులు ప్రేమతో, అత్యంత శ్రద్ధాసక్తులతో అరకు కాఫీని సాగు చేస్తారని అన్నారు. 2016లో అరకు కాఫీ తాగుతున్న ఫొటోలను షేర్ చేసి అరకు కాఫీకి ప్రచారం కల్పించినందుకు థాంక్యూ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు కాఫీపై మోడీ, చంద్రబాబుల ట్వీట్స్ వైరల్ అయ్యాయి.
This post was last modified on June 30, 2024 6:27 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…