కలియుగ దైవం అయిన తిరుమల వెంకన్న ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తిరుమలలో డిక్లరేషన్ అనే అంశంపై చర్చ జరగాలని, వేరే గుళ్లలో లేని డిక్లరేషన్ తిరుమలలో మాత్రం ఎందుకని…ఇక్కడ కూడా డిక్లరేషన్ తీసేయాలని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేదిలో కోటి రూపాయల విలువైన రథం దగ్దం కావడంతో గుడికి నష్టమేమీ లేదని ప్రభుత్వం కొత్త రథం చేయిస్తుందని, పది కేజీల వెండి పోయిందని…ఆరేడు లక్షల రూపాయలు పెడితే మళ్లీ వస్తుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో నాని వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆలయాలపై దాడుల వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వానికి నాని వ్యాఖ్యలు మరింత డ్యామేజీ చేసేలా ఉన్నాయని కొందరు వైసీపీ నేతలు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నాని మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణలు చెప్పబోనని అన్నారు. అంతేకాదు, డిక్లరేషన్ ఎత్తివేయాలని మరోసారి నాని డిమాండ్ చేశారు.
కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడిన తిరుమల ఆలయం డిక్లరేషన్ వ్యవహారంలో నాని వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మతపరమైన సున్నితమైన అంశాల విషయంలో నాని ఇటువంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడంపై చర్చ జరుగుతోంది. ఆ వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే నాని మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. తిరుమలలో అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకునే విధానాన్ని ఎత్తి వేయాలని నాని అన్నారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా ఇది తన నావ్యక్తిగత అభిప్రాయమన్న నాని…తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. 6 కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ కేవలం హిందువుల ప్రతినిధిగా మాత్రమే తిరుమలకు వెళ్లడం లేదని, ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని నాని అన్నారు. సీఎం జగన్‌ను డిక్లరేషన్‌పై సంతకం చేయాలని కోరడం నీచ రాజకీయమన్నారు. సోము వీర్రాజుకు, చంద్రబాబుకు తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ తప్పుగా మాట్లాడలేదని నాని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
This post was last modified on September 22, 2020 8:40 pm
ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈమధ్య ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. మిర్చి సినిమాతో మొదలైన వీరి…
ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ…
ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల…
శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై తన గ్లామర్ తో కుర్ర కారు…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…