టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్కెచ్ వేశారు. 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల కార్యక్రమాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి పించన్లను అందించాలని.. అధికారులను, వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఆయన ఆదేశించారు. మరోవైపు.. రాజకీయంగా కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంత్రులు, కార్యకర్తలు, నాయకులను కూడా రంగంలోకి దింపుతున్నారు.
వారి ద్వారా.. ప్రతి ఇంటికీవెళ్లి లబ్ధి దారులకు పింఛన్లు పంపిణీ చేయడంతోపాటు.. తాను రాసిన బహిరంగ లేఖను కూడా.. వారికి అందించాలని ఆదేశించారు. ఒకరకంగా.. జూలై 1వ తారీకున రాష్ట్రంలో పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద పండుగ మాదిరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడెక్కడ నాయకులు ఉన్నా.. క్షేత్రస్థాయికి రావాలని ఆదేశించారు. దీంతో ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ తమ నియోజకవర్గాలకు ఇప్పటికే చేరుకున్నారు.
జూలై 1 ప్రతి ఒక్కరూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి లబ్ధి దారుడిని కలుసుకుని.. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను అందించనున్నారు. ఈ సారి పింఛనును ఒకేసారి రూ.1000 చొప్పున పెంచి ఇవ్వడంతోపాటు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా పెంచిన సొమ్మును ఇస్తున్నారు. ఇది ఒక రకంగా.. ప్రభుత్వానికి ప్రజల్లో పెద్ద ఎత్తున సానుభూతిని తీసుకువస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఇప్పటి వరకు సామాజిక భద్రతా పింఛన్లను ప్రతి నెలా 1వ తేదీనే.. ఇంటింటికీ పంపిస్తున్నానని చెప్పుకొంటున్న మాజీ సీఎం జగన్‌కు కూడా.. చంద్రబాబు చెక్ పెడుతున్నారు. తానే కాదు.. తనకు మించిన విధంగా తమ ప్రభుత్వం ప్రజలకుమేలు చేస్తోందని ఆయన చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తొలి అడుగులోనే సక్సెస్ సాధించి.. జగన్ వ్యూహానికి పెద్ద గండి కొట్టనున్నారు. ఇది వచ్చే ఎన్నికల నాటికి తనకు .. పార్టీకి, ప్రషభుత్వానికి కూడా మేలు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
This post was last modified on June 30, 2024 10:54 am
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…