ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. విభజన సమస్యలపై దృష్టి పెట్టింది. ప్రధానంగా పొరుగున ఉన్న తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడంపై కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా విద్యుత్ బకాయిలు వసూలుకు రంగం రెడీ చేసింది.
అయితే.. దీనికి తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. గతంలో జగన్ ప్రభుత్వం ఏకంగా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. తెలంగాణ నుంచి 5 వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు రావాల్సి ఉందని.. పదేళ్లయినా.. ఇవ్వడం లేదని.. ఇప్పించాలని అప్పట్లోనే జగన్ వేడుకున్నారు. అయితే.. కేంద్రం సంప్రదింపుల ద్వారా సరిచేస్తానని చెప్పింది. కానీ, చేతులు ఎత్తేసింది.
ఇక, ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం వసూలు చేసుకుని తీరుతామని చెబుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా 9, 10 షెడ్యూల్ లో ఉన్న సంస్థల మధ్య విభజన పూర్తి కావాల్సి ఉంది.
ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలి. విభజన తర్వాత పంపకాల విషయంలో ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. దీంతో ఇప్పటికీ కొన్ని సంస్థలు విషయంలో చిక్కుముడి వీడడం లేదు.
ఇలాంటి సంస్థల్లో మున్సిపల్ శాఖకు చెందిన కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. అలాంటి సంస్థలపై పురపాలక, పట్టణాభివృద్ధి దృష్టి పెట్టింది. హైదరాబాద్ లోని ఏపీ హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆస్తులను గతంలోనే ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన విభజించారు.
విభజన ఎలా చేయాలనే విషయంపై పెద్ద ప్రణాళికే వేశారు. అయితే.. దీనిని అమలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు 5170 కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సి ఉంది. ఆయా సంస్థల ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు, హై కోర్టుల్లో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అయితే.. ఇవన్నీ.. పరిష్కారం అయ్యేందుకు ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించినా.. ఫలితం అయితే తక్కలేదు. సో.. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కూటమి సర్కారు ఇప్పటికిప్పుడు విద్యుత్ బకాయిలు రూ.5 వేల కోట్లు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. త్వరలోనే తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏమరకు ఇది సక్సెస్ అవుతుందనేది ప్రశ్న. మరోవైపు.. తెలంగాణ కూడా స్పందించేందుకు ముందుకు రాదు. ఇది రాజకీయ వివాదంగా మారింది.
ఇప్పుడు రేవంత్ ఏ చిన్న సాహసం చేసినా.. మున్ముందు.. ఏపీకి సహకరిస్తున్నడు! అంటూ.. వివాదాన్ని మరింత పెంచితే.. రాజకీయంగా ఆయన డ్యామేజీ అవుతారు. సో ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే.. తెలంగాణతో తొలి పేచీ అయితే స్టార్ట్ అయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 30, 2024 10:51 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…