రాజధాని విషయంపై వ్యూహం మార్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీనిపై ఇప్పటికే అనేక రూపాల్లో యుద్ధం చేసిన బాబు.. ఒకరకంగా అస్త్ర సన్యాసం చేసేశారు. మూడు రాజధానుల విషయంలో అమరావతి రైతులను, ప్రజలను, మహిళలను, యువతను కూడా ఆయన ప్రభావితం చేశారు. ఎక్కడెక్కడో ఉన్న వారిని కూడా ఏకతాటిపైకి తెచ్చారు. ప్రభుత్వంపైనా.. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌పైనా బాబు వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో ఎన్నడూ జోలె పట్టని చంద్రబాబు.. అది కూడా చేసేశారు.
అయితే, ఎన్ని చేసినా.. జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ.. ఈ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో న్యాయ పోరాటం అన్నారు. అది కూడా సాధ్యమవుతున్న పరిస్తితి లేదు. కేంద్రం ముందు సాగిలపడ్డారు. కేంద్రమే ఆదుకోవాలన్నారు. మోడీ హఠావో అన్న నోటితోనే.. మోడీనే దేవుడు అన్నారు. ఆయనే వచ్చి అమరావతిని కాపాడుకోవాలన్నారు. అయినా.. వర్కవుట్ కాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ అధినేత మరోరూపంలో ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు టీడీపీ నాయకులు. వారి చూచాయగా చెబుతున్న దానిని బట్టి.. త్వరలోనే చంద్రబాబు.. మరోసారి జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు.
అదేసమయంలో ఏ పార్టీ రాజధాని అంశంపై కలిసి వస్తే.. ఆ పార్టీతో జట్టుకు కూడా వెనుకాడేది లేదనే సంకేతాలు పంపాలని రెడీ అయ్యారట. మరీ ముఖ్యంగా బీజేపీతోనూ ఈ విషయంలో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తోంది. దీనిని అవసరమైతే.. బీజేపీకి ఇచ్చేసి .. తాను సహకరించాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇక, సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా వార్తలు రాయించడంతోపాటు.. రాజధాని అంశాన్ని జాతీయ స్తాయిలోనూ ఉద్యమించేలా ముందుకు నడిపించాలని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ ఉద్యమాన్ని రెండు రూపాల్లో నడిపించాలని భావిస్తున్నారట. మరి అవైనా సక్సెస్ అవుతాయా? చూడాలి. బాబు వ్యూహం ఏమవుతుందో అంటున్నారు టీడీపీ నేతలు కొందరు.
This post was last modified on September 22, 2020 8:32 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…