వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు అన్నీ, ఇన్నీ కావు. ఎన్నికల సమయంలో ఆయన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల కమీషన్ పలువురు అధికారుల మీద చర్యలు తీసుకున్నా వారి స్థానంలో తిరిగి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారినే పోస్టింగ్ కోసం సిఫారసు చేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుండి తప్పించి నూతనప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి జవహర్ రెడ్డి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యది కూడా అదే పరిస్థితి.
త్వరలో ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. జవహర్ రెడ్డిని సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలా భాస్కర్‌ను అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. పూనం మాలకొండయ్య అప్పటి వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కూడా ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనుండడం గమనార్హం.
This post was last modified on June 28, 2024 10:16 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…