ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మీడియా మొఘల్ దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం సంధర్బంగా ఆయన కుమారుడు కిరణ్ అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈ సంధర్భంగా ఆయన ప్రసంగించారు.
‘నాన్న గారి సంస్మరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారు. ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. నాన్న గారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాం’ అని కిరణ్ అన్నారు.
నాడు ఆయన నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు సూచించారని, ఆయన స్ఫూర్తితో అమరావతి నిర్మాణం కోసం తాము రూ.10 కోట్లు విరాళం అందిస్తున్నామని ప్రకటించారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రామోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని చెప్పగా, అమరావతిలో రామోజీరావు విగ్రహం పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…