టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తనకు తానే స్వయంగా తన ముందు అతి పెద్ద టాస్క్ పెట్టుకున్నారు. ఇద్దరు కీలక వ్యక్తులకు రెండు భారతరత్నలు సాధించేందుకు ఆయన సంకల్పం చెప్పుకొన్నారు. కొన్ని రోజుల కిందట ఒక రత్నాన్ని ఎంచుకోగా.. తాజాగా మరో రత్నాన్ని ఆయన ప్రతిపాదించారు. ఇద్దరూ కూడా.. చంద్రబాబుకు అత్యంత దగ్గరైన వారు.. అదే సమయంలో అత్యంత అవసరమైన వారు. రాజకీయంగా వారే ఆలంబనగా చంద్రబాబు సుదీర్ఘ ప్రస్థానం కూడా సాగడం విశేషం.
వారిలో ఒకరు టీడీపీ వ్యవస్థాపకుడు, చంద్రబాబు మావగారు.. ఎన్టీఆర్. రెండో వారు.. చంద్రబాబును రాజకీ యంగా చేయి పట్టి నడిపించి.. ఆయన కష్టకాలంలో వెన్నుదన్నుగా ఉండి.. అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా సహకరించిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు. ఈ ఇద్దరికీ కూడా.. భారతరత్న అవార్డులు సాధించాలన్నది చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం. కొన్ని రోజుల కిందట.. పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు.
దీనికోసం పార్టీ పరంగానే కాకుండా.. ప్రభుత్వ పరంగా కూడా.. చర్యలు తీసుకునేందుకు ఎంపీలు ప్రయ త్నించాలన్నారు. దీంతో ఎంపీలు ఆపనిపై ఉన్నారు. ఇక, తాజాగా విజయవాడ శివారులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన.. రామోజీరావు సంస్మరణ సభలో చంద్రబాబు రెండో భారత రత్నను ప్రతిపాదించారు. రామోజీకి భారతరత్న తీసుకురావడం మనందరి కర్తవ్యం అంటూ.. బాబు వ్యాఖ్యానించారు. అంటే.. ఆయన పాత్ర మరింత పెరిగింది.
ఏటా ఆగస్టులో `పద్మ` అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. వీటితో పాటే భారత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను కూడా.. అదే నెలలో తొలుత ఎనౌన్స్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రత్నాలు సాధించేందుకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో చంద్రబాబు ఏమేరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి. అయితే.. ఒకే రాష్ట్రానికి ఒకేసారి రెండు రత్నాలు ప్రకటించే సంప్రదాయం లేదు. కానీ, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో సాకారం చేసుకునే అవకాశం ఉండొచ్చు. చూడాలి.. మరి ఏమేరకు ఆయన సక్సెస్ అవుతారో!!
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…