ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్నా క్యాంటీన్లను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహకారం అందిస్తారు. ఒక్క క్యాంటీన్ నడవడానికి రోజుకు రూ.20 వేల వరకు నిధులు అవసమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 60 శాతం నిధులు.. కార్పొరేషన్లు 35 శాతం నిధులు వెచ్చించేలా ప్లాన్‌చేస్తున్నారు.
అన్నా క్యాంటీన్లను గతంలో నిర్వహించినప్పుడు కూడా ఇదే పద్ధతిలో నిధులను వెచ్చించారు. అయితే.. ఇప్పుడు వీటికి తోడు అన్నా క్యాంటీన్లను మరింత ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా.. ప్రధానంగా వినియోగించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలను ఆయన ప్రోత్సహిస్తారు. ఆయా సంస్థలు ఒక రోజు విరాళంగా ప్రాంతాల వారీగా కానీ.. మండలాల వారీగా కానీ.. జిల్లాల్లో కానీ.. భోజనం సహా అల్పాహారాలు అందించేం దుకు అవకాశం కల్పించనున్నారు.
అదేవిధంగా వ్యక్తులను కూడా అన్నాక్యాంటీన్లలో భాగస్వామ్యం చేయనున్నారు. సహజంగా ఇళ్లకు మాత్ర మే పరిమితమయ్యే పుట్టిన రోజులు, పెళ్లిరోజులు, ఇతరత్రా శుభకార్యాలయాల రోజుల్లో పది మందికి భోజ నం పెట్టాలని అనుకునేవారు ఉంటారు. వీరికి అన్నాక్యాంటీన్లను చేరువ చేయాలని చంద్రబాబు భావిస్తు న్నారు. వారు ఆ రోజు వరకు అన్నాక్యాంటీన్ల ద్వారా.. పేదలకు ఆహారం అందించేలా ఈ క్యాంటన్లలో వెసులుబాటుకల్పించనున్నారు. తద్వారా.. సమాజానికి సేవ చేశామన్న తృప్తి వారికి.. అన్యాక్యాంటీన్ల ద్వారా.. పేదలకు ఆహారం అందించామన్న సంతృప్తి వీరికి దక్కేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
This post was last modified on June 27, 2024 8:11 pm
దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసమంటూ తమిళనాడు రాజధాని చెన్నైలో ఆ రాష్ట్ర అధికార పార్టీ డీఎంకే శనివారం ఓ…
చామకూర మల్లారెడ్డి... నిత్యం వార్తల్లో ఉండే రాజకీయ నాయకుడు. పూలమ్మాను, పాలమ్మాను అంటూనే విద్యావేత్తగా మారిపోయిన మల్లారెడ్డి... ఆ తర్వాత…
ఎక్కడ ఏ రాష్ట్రంలో షూటింగ్ చేసినా అదో పెద్ద సంచలనంగా మారిపోయిన ఎస్ఎస్ఎంబి 29 గురించి రాజమౌళి ఇప్పటిదాకా అధికారికంగా…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చి…
ఏపీలో విపక్షం వెనుక ఓ పక్కా ప్రణాళికతో వేసే ప్రతి అడుగును ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ వేయించే…