వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఇల్లూ, వాకిలీ వదిలిపెట్టి వెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాశీ పుణ్యక్షేత్రంలో తలదాచుకున్న కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు.
అనారోగ్యంతో ఆరుద్ర కూతురు వీల్ చెయిర్ కే పరిమితమయింది. ఆమెకు కలిగిన ఇబ్బందులు, ఆమె కూతురు దుస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు నాయుడు అవసరమైన సాయం అందిస్తామని ఈ నెల 14న హామీ ఇచ్చారు. ఆరుద్ర కుమార్తెకు వైద్యం చేయిస్తామని, ఆర్థిక సాయం అందిస్తామని భరోసానిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పిలిచి రూ.5 లక్షల చెక్ అందజేశారు. .‘నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లే నా కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉంది’ అని ఆరుద్ర అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేస్తాం, చూస్తాం అనడమే తప్ప ప్రభుత్వం తరఫున తనకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, పైగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని ఆరుద్ర వాపోయింది. కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పారని, తమను ఇబ్బంది పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని, కోర్టు కేసులు క్లియర్ చేసి తమ ఆస్తి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
This post was last modified on June 27, 2024 8:02 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…