ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ముందుకు సాగాలంటే.. సఖ్యత, సానుకూలతలు చాలా ముఖ్యం. కాదు.. నా దారి నాదే.. నాదూల నాదే.. అంటే.. ఎవరిదారి వారిదే అవుతుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఏపీ-తెలంగాణల మధ్య అన్నదమ్ముల బంధం, స్నేహం కొనసాగాలనుకునే వారికి ఎప్పటికప్పుడు ప్రతిబంధకాలు వస్తూనే ఉన్నాయి. “రాష్ట్రాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం” అన్న నాయకులు గడిచిన ఐదేళ్లపాటు కత్తులు నూరుకున్నారు. దీంతో ఏపీ-తెలంగాణల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఇక, గత ఏడాది ఎన్నికల్లో జగన్ విజయం సాధించిన తర్వాత.. పాలు-తేనెల మాదిరిగా కలిసిపోతామం టూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన ఏపీకి వచ్చారు. ఇక్కడ నుంచి జగన్ కూడా అక్కడకు వెళ్లారు. దీంతో ఇంకేముంది.. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటయ్యాయా? అనే చర్చ వచ్చింది.
కానీ, ఇంతలోనే సీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ ఎత్తుకోగానే కేసీఆర్ ఖస్సుమన్నారు. దీంతో ఇరువురు సీఎంల మధ్య నీటి వివాదాలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య నీటి సంబంధిత సమస్యలు, ప్రాజెక్టుల సమస్యలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, మద్యం రవాణా, వంటి అనేక సమస్యలు ఉన్నాయి.
ఇక, వీటిని పరిష్కరించుకునేందుకే అనేక ఇబ్బందులు వస్తున్న క్రమంలో ఇప్పుడు తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య మరింత మంట పుట్టిస్తున్నాయి. ఏపీలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు ఏర్పాటు చేయడంపై.. తనకు అవసరం లేకున్నా కూడా హరీష్ వ్యాఖ్యలు సంధించారు.
నాలుగు వేల కోట్ల కోసం.. జగన్ ఈ పనిచేశారంటూ.. హరీష్ రావు.. చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. తమకు కూడా కేంద్రం 2500 కోట్లు ఇస్తానని చెప్పిందని, కానీ, మేం రైతు ప్రయోజనాల కోసం.. కట్టుబడి సొమ్ము తీసుకోవడానికి ఇష్టపడలేదని చెప్పుకొచ్చారు.
అంటే.. ఇక్కడ జగన్ ఏదో రైతులకు శత్రువని, ఆయన డబ్బు కోసం ఎంతకైనా దిగజారతారనే కోణంలో హరీష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగుతోంది. కానీ, హరీష్ వ్యాఖ్యల వెనుక వాస్తవం వేరే ఉందని అంటున్నారు తెలంగాణ నేతలు. కేంద్రం ఇస్తానన్నది ఊరికేనే కాదు.. అప్పు రూపంలోనే! దీనిని తీసుకోవడం కేసీఆర్‌కు ఇష్టం లేదు. పైగా.. తాను జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మోడీ విధానాలను వ్యతిరేకించేవారిని తనవైపు తిప్పుకొనేందుకు ఇది సాధ్యపడుతుందని అనుకున్నారు.
ఇక, ఎన్ని చేసినా.. జగన్ .. మోడీ విషయంలో మారడు కాబట్టి.. రేపు.. జగన్ విషయంలో తనపై అపవాదు రాకుండా.. (అంటే.. జాతీయ స్థాయిలో తనకు మద్దతిచ్చే విషయంపై..) చూసుకునేందుకు ఇలా వ్యవహరించారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఏదేమైనా.. హరీష్ వంటి కీలక నాయకుడు చేసిన వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా కేసీఆర్ ఉండే ఉంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on September 22, 2020 1:44 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…