కలలు కనడం ఈజీనే. కానీ, వాటిని సాకారం చేసుకునేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అది కూడా.. వ్యక్తిగత కలలైతే బాగానే ఉంటుంది. కానీ, ప్రభుత్వ పరంగా ఒక వ్యవస్థను మార్చాలని కలలు కంటే మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఈ సమస్యే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకు వచ్చింది. ఆయన తొలి సమీక్షలోనే కీలక ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. గ్రామీణ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎందుకు విస్తరించకూడదన్నది ఆయన ప్రశ్న.
ఇది పైకి చాలా బాగానే ఉంది. చేస్తే.. చాలా మంచిదే. కానీ, ఇది అమలు కావడం.. అమలు చేయడం అనేది అంత ఈజీకాదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజుకు రూ.220 అందుతోంది. ఏడాదికి 100 రోజులు పనులు కల్పిస్తున్నారు. దీనిని రైతులకు.. ముఖ్యంగా వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని.. రైతులపై భారం తగ్గించాలని పవన్ ఆలోచన. ఇది మంచిదే. తద్వారా.. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని ఆయన తగ్గించాలని చూస్తున్నారు.
అయితే.. పవన్ చేసిన ఆలోచన కొత్తకాదు. గతంలో జగన్ కూడా ప్రయత్నించారు. ఇంతకు ముందు .. చంద్రబాబు కూడా.. ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. దీనికి కారణం.. కరువు పనులుగా గ్రామీణ ప్రాంతాల్లో పేర్కొనే ఉపాధి హామీ పనులు తక్కువుగా ఉంటాయి. అంటే..రెండు గంటలు గట్టిగా పనిచేస్తే చాలు మస్టర్ వేయించుకుంటే చాలు.. సొమ్ములు చేతిలో పడతాయి. పైగా రక్షణ కూడా ఉంటుంది. కానీ.. వ్యవసాయ పనులకు వచ్చే సరికి మాత్రం ఈ సొమ్ములు చాలవు.
ప్రస్తుతం రైతు కూలీలకు రూ.500 నుంచి 600ల వరకు గిట్టుబాటు అవుతోంది. సీజన్‌లో మాత్రమే ఉండే ఈ పనులకు నైపుణ్యం కూడా అవసరం. అందరూ చేయలేరు. దీంతో ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలను అటు మళ్లించడం అనేది ప్రయాసతో కూడుకున్న ప్రక్రియగా చంద్రబాబు హయాంలోనూ.. తర్వాత..జగన్ హయాంలోనూ నిరూపితమైంది. పైగా.. దీనికి కేంద్రం ఇచ్చే నిధులు చాలవు. ఎటొచ్చీ.. రైతులు ఖర్చు చేయాల్సిందే.అంతేకాదు.. ఒకసారి.. వ్యవసాయ పనులను ఉపాధి పనులతో జోడిస్తే.. రైతుల మాట కూలీలు వినే పరిస్థితి ఉండదని అనేక సందర్భాల్లో తేలిపోయింది. సో.. పవన్ కలలు కంటున్నా.. ఇది సాధ్యం కావడం అంత ఈజీ కాదనే అంటున్నారు పరిశీలకులు. చేస్తే మంచిదేనని చెబుతున్నారు.
This post was last modified on June 24, 2024 10:30 am
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…