పనిచేయాలన్న సంకల్పం.. రాష్ట్రానికి ఏదో మేలు చేయాలన్న తపన.. ఉంటే.. కష్ట సాధ్యం అయినదేదీ ఉండదు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారంలోకి వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాకుముందే.. కీలక ప్రాజెక్టు లైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ఆయన దాదాపు పట్టాలెక్కించేశారు. ప్రమాణస్వీకారం అనంతరం.. పోలవరం, అమరావతిలో పర్యటించిన తర్వాత.. చంద్రబాబు ఒకరకంగా నిర్వేదం వ్యక్తం చేశారు. పోలవరం నాశనం అయిందని.. అమరావతిని ముంచేశారని వీటిని లైన్లో పెట్టాలంటే.. చాలా కష్టపడాలని కూడా చెప్పారు. దీంతో అందరూ ఇప్పట్లో ఇవి ప్రారంభం కావేమో అనుకున్నారు.
కానీ, చంద్రబాబు తపన ఎంత క్లిష్ట సమస్యలకైనా మార్గం చూపించే పరిస్థితిని తీసుకువచ్చింది. అమరావతిని తీసుకుంటే.. చంద్రబాబు పర్యటన అనంతరం.. ఇక్కడ దృశ్యాలు మారిపోయాయి. రాత్రికి రాత్రి రెండు రోజుల ఇక్కడ సీఆర్డీఏ అధికారుల ఆధ్వర్యంలో వందల మంది కూలీలను ఏర్పాటు చేసి.. తుమ్మలు, తుప్పలు తొలగించేశారు. గోతులు పడి, పాడుపడిన రహదారులను కూడా బాగు చేయిస్తున్నారు. అదేసమయంలో బూజు పట్టిన కట్టడాల దుమ్ముదులుపుతున్నారు. నీట మునిగిన భవనాల వద్ద.. నిల్వ ఉన్న నీటిని తోడిస్తున్నారు. ఈ పనులు రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి.
ఇంతలోనే పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. పెట్టుబడులు పెట్టేవారు రావాలంటూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించింది. అదేసమయంలో పోలీసులను కూడా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయించి.. భద్రత కల్పించడం గమనార్హం. అదేవిధంగా జాతీయ పత్రికలతోపాటు అంతర్జాతీయ పత్రికల్లో నూ అమరావతికి పెట్టుబడులు వచ్చేలా ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించరు.
పోలవరం..
ఇక, ఏపీకి కీలకమైన ప్రాజెక్టు పోలవరం. దీనిలో అనేక లోపాలు వెలుగు చూసిన నేపథ్యంలో చంద్రబాబు విస్మయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాక్ డ్యాం, స్పిల్ వే, గైడ్ బండ్ వంటివి దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి శనివారమే ఆయనే కేంద్ర జలశక్తి శాఖకు సమాచారం ఇవ్వడం.. ఆవెంటనే అమెరికా, కెనడా నుంచి అంతర్జాతీయ జలవనరుల విషయంలో నిపుణులైన ఐదుగురు ఇంజనీర్లను రప్పించేందుకు ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వీరు ఏడాది పాటు పోలవరానికి సంబందించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అదేసమయంలో వ్యయం తగ్గించేలా కూడా వీరు సూచనలు చేయనున్నారు. ఎలా చూసుకున్నా.. కీలక ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు అడుగులు వడివడిగా పడుతుండడం గమనార్హం.
This post was last modified on June 24, 2024 1:33 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…