Political News

కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం !

లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైన నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం రేగుతున్నది. కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితం అయింది. జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసుల అంశాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని ప్రజాపనుల మంత్రి సతీశ్‌ జార్కిహోళి, సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ బహిరంగంగా డిమాండ్‌ మొదలుపెట్టారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్యపై వారు ఒత్తిడి తెస్తున్నారు. సతీశ్‌ జార్కిహోళి, కేఎన్‌ రాజన్న ఎస్టీ వర్గానికి చెందినవారు కాగా, జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ముస్లిం. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో మళ్లీ అంతర్గత పోరు మొదలైంది.

సీఎం సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూర్‌లో పార్టీ ఓటమిపాలైంది. అలాగే బెంగళూరు రూరల్‌ స్థానంలో తన సోదరుడు డీకే సురేశ్‌ను శివకుమార్‌ గెలిపించుకోలేకపోయారు. మైసూరులో బీజేపీ అభ్యర్థి క్రిష్ణదత్త చామరాజ వడియార్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ణపై 1,39,262 ఓట్లతో గెలవడం విశేషం. బెంగుళూరు రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మంజునాథ్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ ను 2,69,647 ఓట్లతో ఓడించడం గమనార్హం.

అదనపు ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలని లోక్ సభ ఎన్నికల ముందు సీనియర్ మంత్రులు జీ పరమేశ్వర, సతీశ్‌ జార్కిహోళి, హెచ్‌సీ మహదేవప్ప, రాజన్న, కేహెచ్‌ మునియప్ప తదితరులు ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఈ డిమాండ్ మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఎక్కడికి దారితీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

This post was last modified on June 24, 2024 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు రాక‌తో మ‌ళ్లీ లులూ జోష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రాక‌తో మ‌ళ్లీ పెట్టుబ‌డుల‌కు జోష్ పెరిగింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడు మాసాల్లోనే ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు…

3 hours ago

తీగ దొరికింది డొంక ప్యాలెస్‌లో వుంది: ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం…

4 hours ago

దసరా పండక్కు టాలీవుడ్ సూపర్ 6

మాములుగా టాలీవుడ్ దసరాకు స్టార్ హీరోల సినిమాలు రావడం సహజం. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో…

4 hours ago

శంకర్ & తమన్ ‘గేమ్ ప్రెజర్’

గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ పబ్లిసిటీ పరంగా దిల్ రాజు టీమ్ మీద భారీ ఆశలు…

6 hours ago

‘పుష్ప’ మ్యాజిక్‌ను ‘దేవర’ రిపీట్ చేస్తుందా?

నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అందుకున్న సౌత్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఉత్తరాదిన…

7 hours ago

జగన్ ‘మానవత్వం’పై ఎన్ని కౌంటర్లో..

"నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం" అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ…

7 hours ago