మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఘన నివాళులు అర్పించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమైంది. ఈ నెల 27న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. రామోజీరావు పుట్టిపెరిగిన.. కృష్ణాజిల్లాలోనే ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 5 కోట్ల ను విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర సహా.. మరికొందరు సమన్వయం చేసుకుంటున్నారు.
ఇక, రామోజీ సంస్మరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ సహా .. పాత్రికేయులు.. ఇతర రంగాల ప్రముఖులు.. ప్రజాప్రతినిధులు హాజరువుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. వీవీఐపీలకు, సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి గ్యాలరీకి ఇంఛార్జీలను నియమించారు. ప్రధాన వెన్యూ ప్రదేశంలో డయాస్, బారికేడింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వెన్యూ రహదారులు మరమ్మతులు చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అదే రేంజ్‌లో ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. అయితే.. ఇప్పటికే రామోజీ రావు జ్ఞాపకాలు తెలుగు వారితోనూ.. తెలుగు నేలతోనూ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా.. ఏర్పాట్లు చేస్తామని.. సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఏపీ ప్రెస్ అకాడమీ పేరును ఆయన ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాజధాని అమరావతి పేరును ఆయనే సూచించిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోనూ రామోజీ విగ్రహానికి స్థలాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. దీనిపై చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. అమరావతిలో రామోజీ స్మారకం నిర్మిస్తామన్నారు. ఈ రెండు కార్యక్రమాలకు కూడా.. ఈ నెల 27న నిర్వహించే సంస్మరణ సభలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
This post was last modified on June 24, 2024 10:08 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…