అందరిలో ఇదే చర్చ. ఇదే అనుమానం. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలాకాలం అసలు జనాలకే కనబడలేదు. మీడియా మొహం కూడా చూడలేదు. పోనీ సినిమాల్లో ఏమన్నా బిజి అయిపోయారా అంటే అదీలేదు. పార్టీ కేడర్ కి అందుబాటులో లేరు. ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలీనంతగా హైడవుట్లో ఉండిపోయారు. ఎప్పుడో ఒకసారి జనసేన తరపున ఓ ప్రెస్ రిలీజో లేకపోతే ఓ వీడియో సందేశమో పవన్ పేరుతో బయటకు వచ్చేదంతే. అలాంటిది గడచిన కొద్ది రోజులుగా బాగా యాక్టివ్ అయిపోయారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్లో దూకుడు కనబడుతోంది. బిజెపితో పొత్తు విషయం ప్రకటించేందుకే చాలా కాలం అజ్ఞాతంలో ఉన్న పవన్ మీడియా ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఎప్పుడైతే కమలం పార్టీతో చేతులు కలిపారో అప్పటి నుండి యాక్టవ్ గా కనిపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఏదో రూపంలో తన గొంతును వినిపించటం మంచిదే. పవన్ దూకుడుతో జనసేన శ్రేణుల్లో కూడా కాస్త జోష్ పెరుగుతోంది. బిజెపితో పొత్తుపెట్టుకోవటం, రాజకీయాల్లో దూకుడుపెంచటంతో పాటు మళ్ళీ సినిమాల్లో కూడా యాక్టివ్ అవ్వటం వెనుక జనసేనాని వ్యూహం ఏమిటన్నదే ఇపుడు ప్రశ్నార్ధకమైంది. బిజెపి నేతలు ఇచ్చే సమాధానం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుండి కోలుకోవటానికి పవన్ కు కాస్త సమయం పట్టిందట.
తనకు వచ్చే ఓట్లపై పవన్ కు ఓ అంచనా ఉన్నా మరీ ఇంత అధ్వాన్న స్ధితి ఉంటుందని ఊహించలేదట. అంతేకాకుండా టిడిపినే తిరిగి అధికారంలోకి వస్తుందని, వారికి తన అవసరం కూడా పడే అవకాశం ఉందని పవన్ కూడా ఆశలు పెట్టుకున్నాడని కమలనాధులు చెబుతున్నారు. అయితే తాను ఆశించినదానికి భిన్నమైన ఫలితాలు రావటమే కాకుండా వైసిపికి బంపర్ మెజారిటి రావటాన్ని పవన్ ను విస్మయానికి గురిచేసిందట. ఎన్నికల ముందు జగన్ సీఎం కాలేరు అని పవన్ తన నోటితో అన్నారు. ఇక అన్నింటికీ మించినదేమంటే పోటి చేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకల్లో ఓటమి పవన్ ను బాగా బాధించిందట.
అందుకనే చాలాకాలం ఇంటికే పరిమితమైన పవన్ మళ్ళీ తాజా వ్యూహాలతో రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలన్న ఉద్దేశ్యంతోనే తమతో పొత్తు పెట్టుకున్నట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ పార్ట్ తీసుకుని ఏదో ఓ నియోజకవర్గం నుండి తాను, మినిమమ్ నెంబర్ తో అయినా అసెంబ్లీలో తన పార్టీని ఉంచాలన్న పట్టుదల పవన్ లో కనిపిస్తున్నట్లు మిత్రపక్షం నేతలు చెబుతున్నారు. అందుకనే బిజెపితో పొత్తు పెట్టుకుని ప్రతిపక్షంగా చాలా యాక్టివ్ అయిపోతున్నట్లు అభిప్రాయపడ్డారు.
అంతా బాగానే ఉంది కానీ పవన్ లో ఈ దూకుడు ఎంతకాలం ఉంటుందన్నదే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే పవన్లో అసలు సమస్యే నిలకడలేనితనం. ఈరోజు చెప్పిన మాట మీద రేపు తాను కట్టుబడుండడు. బహిరంగసభల్లో తాను మాట్లాడిన మాటలను కొద్దిసేపటికి తాను కాంట్రడిక్ట్ చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. అందుకనే పవన్ నమ్ముకుని ఎవరు రాజకీయాలు చేయటానికి ముందుకు రావటం లేదు. మొన్నటి ఎన్నికల సమయంలో పవన్ను నమ్మిన వామపక్షాలు, బిఎస్పీ గతేమయ్యిందో అందరూ చూసిందే. ఏదేమైనా ప్రతిపక్ష పాత్ర పోషించటంలో పవన్ చురుకైన పాత్ర పోషించటం మంచిదే కదా.
This post was last modified on September 22, 2020 10:20 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…