ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ఆ సీనియర్ నాయకుడి రాజకీయ భవిష్యత్ ఇప్పుడు అయోమయంలో పడింది. మునిగిపోతున్న పడవ లాంటి పార్టీలో నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీనియర్ నాయకుడు ఎవరో కాదు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. టీడీపీలో నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ఈ వరంగల్ లీడర్ డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘనత సాధించారు. కానీ నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు చెందిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి చేతిలో పాలకుర్తి నియోజకవర్గంలో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్నారు.
ఈ ఓటమి ఒకవైపైతే మరోవైపు బీఆర్ఎస్ ఉనికి రాష్ట్రంలో ప్రమాదంలో పడింది. ఆ పార్టీలో ఉంటే పొలిటికల్ కెరీర్ కొనసాగే అవకాశం లేదని భావిస్తున్న ఎర్రబెల్లి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఎర్రబెల్లిని రేవంత్ పార్టీలోకి తీసుకుంటారా? అన్నదే ఇక్కడ ప్రశ్న. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎర్రబెల్లితో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంతే కాకుండా గతంలో కాంగ్రెస్‌పై, రేవంత్‌పై ఎర్రబెల్లి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం సాధ్యం కాదనే చెప్పాలి.
ఇక బీజేపీ కూడా ఎర్రబెల్లిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎర్రబెల్లి గతంలో ప్రాతినిథ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గంతో పాటు పాలకుర్తిలోనూ బీజేపీకి బలం లేదు. పైగా ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్‌ను పార్టీలోకి తీసుకునే పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో సాగుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి ఎర్రబెల్లిని చేర్చుకోవడం కరెక్టు కాదని బీజేపీ భావిస్తోందని తెలిసింది.
This post was last modified on June 21, 2024 5:46 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…