తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ అరెస్టయ్యారు. అయితే. . అరెస్టు చేసే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. బాల్క సుమన్ కాలర్ పట్టుకుని.. గుంచిమరీ పోలీసులు ఆయనను జీపులోకి బలవంతంగా నెట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు.. ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు.
అరెస్టు ఎందుకు?
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం హైదరాబాద్ లో తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ అగ్రనేతగా గుర్తింపు పొందిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్‌లో ఉండి.. పదవులు అనుభవించి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతూ.. పార్టీకి ద్రోహం చేశారంటూ.. సుమన్ నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లేందుకు సుమన్ ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగి.. తాము సంఘవిద్రోహ శక్తులం కాదని.. వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఎందుకు అడ్డుకున్నారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఇప్పుడు ఆందోళనలు వద్దు.. సీఎం వస్తున్నారని పోలీసులు చెప్పినా ఎంత సేపటికీ వినకపోవడంతో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ .. సుమన్ కాలర్ పట్టుకుని వాహనంలోకి బలవంతంగా నెట్టడం వైరల్ అయింది. దీనిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే. కూడా సర్కారు ఓర్చుకోలేక పోతోందని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా రేవంత్, భట్టి విక్రమార్కలు ఆయన ఇంటికి వచ్చి.. పార్టీ కండువా కప్పి మరీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
This post was last modified on June 21, 2024 3:42 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…