గత నెల 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం.. మీడియాకు కనిపించని వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే.. తన పేరును పద్మనాభ ‘రెడ్డి’గా మార్చుకుంటానని చెప్పిన ఆయన అన్నంత పని చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిరాష్ట్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది.
తాజాగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కొన్ని పాఠాలు చెప్పారు. డిప్యూటీ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన .. హుందాగా వ్యవహరించాలని సూచించారు. “ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నేను పవన్ కళ్యాణ్‌గారిని ఓడిస్తానని చెప్పా. చేయలేక పోయా. అందుకే నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నా” అని వ్యాఖ్యానించారు.
ఇక, పవన్‌ను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడ ల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముద్రగడ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపికి సూచనలు చేయాలన్నారు. తామేమీ శత్రువులను కామన్నారు. రాజకీయల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని.. అయితే.. ఇదే తీర్పును అడ్డు పెట్టుకుని తమ కుటుంబంపై దాడులు చేయడం ఏంటని ముద్రగడ ప్రశ్నించారు.
This post was last modified on June 21, 2024 1:56 pm
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…