ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. కేవలం లక్ష రూపాయల ష్యరిటీతో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. దీంతో కీలకమైన పాలన విషయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనంటూ..ఈయనపై సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మార్చి 21న ఆయనను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. అయితే.. పార్లమెంటు ఎన్నికలకు ముందు కొంత రిలీఫ్ లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. ఎన్నికల తర్వాత కూడా.. తనకు బెయిల్ కంటిన్యూ చేయాలని.. మూడు రోజులుబెయిల్ ఇవ్వాలని కోరినా కూడా.. కోర్టులు అంగీకరించలేదు. దీంతో ఈనెల 2న కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే.. కేజ్రీవాల్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించినా.. కోర్టు వాటిని తోసిపుచ్చింది. ఇరు పక్షాలవాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసి.. తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో సూత్ర ధారి కేజ్రీవాలేనంటూ.. దర్యాప్తు సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఎందుకు?
ఎన్నికల సమయంలోనే అతి కష్టం మీద బెయిల్ సంపాయించుకున్న కేజ్రీవాల్‌కు ఇప్పుడు భారీ ఊరట లభించడం వెనుక రీజనేంటి? అనేది ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నీటి కోసం.. ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఇదేసమయంలో వైద్య శాలల పనితీరు కూడా.. మారిపోయింది. కీలకమైన మొహల్లా క్లినిక్‌లలో ఔషధాలు కూడా లభించడం లేదు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.
దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న ఆప్ నేతలు.. సీఎంను తీసుకువెళ్లి జైల్లో పెట్టారని.. అందుకే రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మరో ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిణామాలతో తాము బద్నాం అవుతున్నట్టుగా భావించిన కేంద్రం పెద్దలు వెనక్కి తగ్గారని.. ఈడీ తరఫున వాదనలను తగ్గించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌కు బెయిల్ లభించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on June 21, 2024 10:28 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…