ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సొంతంగా టీడీపీ 16 ఎంపీ స్థానాలు, జనసేన 2 స్థానాలతో కలిసి 18 ఎంపీ స్థానాలు గెలుచుకుని టీడీపీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా ఆపగలిగింది అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఈరోజు ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగింది. 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ పదే పదే చెప్పారు. ఈరోజు బీఆర్ఎస్‌కు లోక్ సభ స్థానాలు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేవారం అని కేటీఆర్ అన్నారు.
కానీ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 8 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.కానీ తెలంగాణలో గనులను వేలం వేస్తున్నారు. బొగ్గు గనులను వేలం పెట్టవద్దని గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశాడు.
కానీ ఇప్పుడు బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పాల్గొంటానని ఎందుకు చెబుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
గతంలో ఒడిశాలో రెండు గనులను నైవేలీ లిగ్నైట్ కంపెనీకి, గుజరాత్‌లోని గనులను అక్కడి ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారని గుర్తు చేశారు. తమిళనాడులోనూ ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారని, తెలంగాణలో గనులను వేలం లేకుండా సింగరేణికి అప్పగించాలని కేటీఆర్ కోరారు.
This post was last modified on June 20, 2024 10:03 pm
హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని…
సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్లోనే అలాంటి వీడియోలు…
నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…