ఇదేంటి? అనుకుంటున్నారా? ఔను .. నిజమే. టీడీపీ యువ నాయకుడు.. మంత్రి నారా లోకేష్ తన పార్టీకి చెందిన వారినే కాదు.. కూటమి పార్టీల నాయకుల పనిని కూడా పెంచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్.. ఆ వెంటనే ప్రజాదర్బార్ పేరుతో నిత్యంతన నివాసంలోనే ప్రజలను కలుస్తున్నారు. సుమారు మూడు గంటలపాటు ప్రజలతోబేటీ అవుతున్నారు. ఉదయం7 గంటల నుంచి 10 గంటల వరకు మంగళగిరి నియోజకవర్గం ప్రజలతో మమేకం అవుతున్నారు.
దీంతో సుదీర్ఘ కాలంగా తమ సమస్యలు పరిష్కారం కాని వారు.. వినతి పత్రాలు పట్టుకుని ఉండవల్లిలోని నారాలోకేష్ నివాసానికి క్యూ కడుతున్నారు. ఇలా వచ్చిన వారి సమస్యలను సావధానంగా వినడమే కాకుండా సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తున్నారు.
రోడ్డు సైడ్ వ్యాపారులకు పోలీసుల నుంచి వేధింపులు వస్తున్నాయని వ్యాపారాలు విన్నవించగా..అక్కడికక్కడే ఓ లేఖ రాయించి.. డీజీపీకి పంపించారు. దీంతో ఆవెంటనే డీజీపీ నుంచి కూడా సమాధానం వచ్చింది.
ఇకపై వేధింపులు ఉండవని డీజీపీ చెప్పారు. ఇక ఎక్కడో విశాఖ నుంచి ఓ మహిళ వచ్చి.. తన బాధలు చెప్పుకొన్నారు. వాటిని కూడా వెంటనే నారా లోకేష్ పరిష్కరించారు. ఇలా.. నిత్యం వందల మంది బాధితులు.. వచ్చి సమస్యలు చెప్పుకొంటున్నారు.
అయితే.. తన నియోజకవర్గం వరకే పరిమితం అనుకున్న ప్రజాదర్బార్‌కు ఎక్కడెక్కడ నుంచో వస్తుండడంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోనూ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రజాదర్బార్ నిర్వహిస్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి.
విశాఖ, మచిలీపట్నం, తిరుపతి ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు కూడా.. ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ తమ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు కూడా.. ఇలా.. ప్రజాదర్బార్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని.. ఆయనకు విన్నవించారు.
దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఇక, ఆయన కనుక ఈ సూచనను ముఖ్యమంత్రికి వివరిస్తే.. ఇక నుంచి ప్రజాదర్బార్‌ను అందరూ నిర్వహించడం.. ఖచ్చితం కానుంది. దీంతో సహజంగానే మంత్రులకు పని పెరగనుంది.
This post was last modified on June 20, 2024 2:46 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…