ఓడలు బళ్లు-బళ్లు ఓడలు కావడం.. రాజకీయాల్లో కామనే. కానీ, ఇంతకుమించిన విధంగా వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. 151 స్థానాలతో ఠీవీగా కాలర్ ఎగరేసుకున్న పార్టీ..ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమై.. నేల చూపులు చూస్తోంది. పుంజుకుంటుందా? లేదా? అనేది ఆ పార్టీ అనుసరించే వ్యూహాలను బట్టి ఉంటుంది.
కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తోంది. దీనిలో ప్రధానంగా అసెంబ్లీ వ్యవహారం. నిన్నటి వరకు తొలి వరుసలో కూర్చున్నవైసీపీ.. ఇప్పుడు చివరి వరుసలో కూర్చునే పరిస్థితికి వచ్చింది.
సాధారణంగా సభలో ఎప్పుడూ.. అధికార పక్షం.. సభ్యులకు ప్రాధాన్యం ఉంటుంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం అయితే.. ఆ పక్కగా.. తొలి వరుస నుంచి సభ్యులకు సీట్లు కేటాయిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే.
గతంలో టీడీపీకి కూడా.. ఇలానే తొలి వరుసలోనే.. 4 సీట్లు కేటాయించి.. దాని నుంచి వెనక్కి ఉండే సీట్లను 6 వరుసలు అంటే.. 24 సీట్లను టీడీపీకి కేటాయించారు. 23 సీట్లు రావడంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా సహా.. అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలోనూ చోటు కల్పించారు. దీనికి అప్పట్లో అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు హాజరయ్యేవారు.
అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమే లేకుండా పోయింది. ఈ హోదా దక్కాలంటే.. కనీసం 18 మంది సభ్యులు ఒక పార్టీకి ఉండాలి(మొత్తం సభ్యుల్లో 15 శాతం). కానీ, అధికారం కోల్పోయిన వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి.
దీంతో ప్రధాన ప్రతిపక్షం హోదా లేదు. పైగా.. బీఏసీలోనూ.. చోటుదక్కే చాన్స్ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. ప్రధాన ప్రతిపక్షానికి మాత్రమే బీఏసీలో చోటు ఇస్తారు. ఈ పరిస్తితిని వైసీపీ కోల్పోయింది. ఇదొక పెద్ద మైనస్.
ఇక, ఇప్పుడు మరో కీలక విషయం వెలుగు చూసింది. అసెంబ్లీలో.. ఆ పార్టీకి అన్నింటికంటే చివరి వరుసలో సీట్లు కేటాయిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. సాధారణంగా అసెంబ్లీ అధికారులు ముందుగానే పార్టీలకు సీట్లను కేటాయిస్తారు. తర్వాత స్పీకర్ అభిప్రాయం మేరకు మార్చే అవకాశం ఉంది. కానీ, వైసీపీకి బలమైన సంఖ్య లేకపోవడంతో స్పీకర్ కూడా.. జోక్యం చేసుకునే అవకాశం తక్కువే.
దీంతో సభలో చివరి 11 సీట్లు కేటాయిస్తే.. జగన్ వెళ్తారా? అనేది ప్రశ్న. దాదాపు ఆయన వెళ్లకపోవచ్చని.. అసెంబ్లీ సభా వ్యవహారాలను మాజీ మంత్రి , సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించే అవకాశం ఉందని.. తాను ప్రజాబాట పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
This post was last modified on June 20, 2024 11:58 am
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…