విశాఖలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండపై వైసీపీ హయాంలో జరిగిన నిర్మాణం.. ఇప్పుడు కాక రేపుతోంది. రూ.500 కోట్లతో మహారాజా ప్యాలెస్‌ను తలపించేలా చేపట్టిన ఈ నిర్మాణాలను మూడేళ్ల పాటు సాగించారు.
దీనిలోకి పురుగును కూడా రానివ్వకుండా.. కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ.. కూడా.. విశాఖ రుషికొండపై ఏం జరుగుతోందన్నది ప్రధాన ప్రశ్నగానే మారిపోయింది. ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఇక, తాజా ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి.. టీడీపీ పగ్గాలు చేపట్టాక.. రుషికొండలోకి ప్రజాప్రతినిధులు.. జర్నలిస్టులను తీసుకువెళ్లారు. ఇక్కడి పరిశరాలను.. నిర్మాణాలను చూపించారు. ఇది మహారాజా ప్యాలెస్‌కు భిన్నంగా ఏమీలేదని తేల్చారు. ఆ తర్వాత అనేక కథనాలు… వచ్చాయి. అంతేకాదు.. వాటిపై వ్యాఖ్యానాలు కూడా.. వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్యాలెస్.. రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. గతంలో జగన్ ప్రజావేదికను కూల్చేయడంతో ఇప్పుడు ఈ ప్యాలెస్‌ను కూల్చేస్తారా? అనేది చర్చ.
అయితే.. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు అలా చేయకపోవచ్చు. కానీ, ఈ ప్యాలెస్‌ను ఏం చేయాలన్నది మాత్రం సర్కారుకు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికినాలుగు ఆప్షన్లు పరిశీలిస్తున్నారు. వీటిలో ఒక్కటి వర్కవుట్ అయినా.. ప్యాలెస్ విషయంలో మంచి చేసినట్టేనని కొందరు చెబుతున్నారు.
1) కేంద్ర పర్యాటక శాఖకు ఈ ప్యాలెస్‌ను విక్రయించడం.
2) రాష్ట్ర పర్యాటక పరిధిలోనే దీనిని ఉంచడం.
3) త్రివిధ దళాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకోవడం.
4) ప్రభుత్వ అతిథి గృహంగా గుర్తించడం.
ఈ నాలుగు పరిధిల్లో ఒక్కటి సక్సెస్ అయినా.. ఫర్వాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ సమావేశాలకు.. రాజధానిలో నిర్మాణాలు ఉన్నాయి. లేకపోతే.. కేబినెట్ సమావేశాలకు.. దీనిని వినియోగిం చుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఏర్పాటు చేయాలన్నా.. కడు దూరం. అంటే.. ఒక నిర్ణయం తీసుకునేందుకు ఎలానూ ఈ ప్యాలెస్ ప్రయోజన కరంగా కనిపించకపోవడం పెను సమస్యగా మారింది. దీంతో ఇప్పుడు నాలుగు ఆప్షన్లను పరిశీలిస్తున్నారు.
This post was last modified on June 20, 2024 11:57 am
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…