మౌనం మంచిది కాదు. కొన్ని కొన్ని సార్లు.. పాలకులు పాటించే మౌనం.. ప్రమాదాలను తరుముకొస్తుంది. గతంలో బాబ్రీ మసీదును కూల్చేసినప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు.. మౌనం దాల్చారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
2జీ సహా.. బొగ్గుగనుల కుంభకోణాలు వెలుగు చూసినప్పుడు.. అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ మితి మీరిన మౌనాన్ని ప్రదర్శించారు. ఫలితంగా కాంగ్రెస్ పదేళ్ల నుంచి మరో ఐదేళ్ల వరకు ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి వచ్చింది.
పొరుగున ఉన్న తెలంగాణలో తన గారాల పట్టి కవితపై.. లిక్కర్ కుంభకోణం ఆరోపణలు వచ్చినప్పుడు.. బీజేపీతో అంటకాగుతున్నారన్న విమర్శలు వచ్చినప్పుడు కూడా.. మాజీ సీఎం కేసీఆర్ ఇంతకన్నా ఎక్కువ మౌనం పాటించారు. ఫలితంగా అసెంబ్లీలో ఒక కన్ను పోగొట్టుకోగా.. పార్లమెంటులో రెండు కళ్లూ పోగొట్టుకు న్నారు.
రాజకీయాల్లో ఉన్నవారు.. మంచైనా.. చెడైనా.. ఏ విషయంపైనైనా.. స్పందించాలి. ప్రజలతో కనెక్టివినీ పెంచుకోవాలి. వివరణ ఇవ్వాలి. మంచి జరిగినప్పుడు.. డప్పుకొట్టుకోవడం సరే.
కానీ, ఏదైనా విమర్శ వచ్చినప్పుడు.. లేదా తమ పాలనలో తప్పు జరిగినప్పుడు.. నిజాయితీగా ప్రజల ముందుకు రావాలి. లేకపోతే.. ఏం జరుగుతుందనేది.. ఇప్పటి వరకు జరిగిన ఘటనలే ఉదాహరణ.
ఇక, ఈ విషయంలో వైసీపీ అధినేత.. తాజా మాజీ సీఎం జగన్ అందరినీ మించిపోయారు. మీడియా ముందుకు రారు.. విమర్శలకు స్పందించరు.. ఆరోపణలపై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయరు. ఫలితంగా ఆయన ఇమేజ్ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది.
జనాల్లో నిన్న మొన్నటి వరకు తనను విశ్వసిస్తారని నమ్మిన జగన్.. విశ్వాసానికి ప్రతీకగా తననే చూస్తారని చెప్పిన జగన్.. అదే విశ్వసనీయతను ఇప్పుడు పోగొట్టుకున్నారు. రుషికొండపై నిర్మించిన.. విలాసవంతమైన భవనం జగన్ రాచరిక మనస్తత్వానికి, పెద ధోరణికి తార్కాణంగా నిలిచిందని.. రాష్ట్రంలోని పత్రికలు కాదు.. జాతీయ స్థాయి మీడియా.. ఏకేస్తోంది.
ఇక, ప్రజల్లోనూ ఇంత సొమ్ము ఖర్చు చేసి ఈ భవనాలను ఎందుకు కట్టించారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. మద్యం విషయంలో నాసిరకం బ్రాండ్లు తీసుకురావాడం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను బలవంతంగా అయినా.. అమలు చేయాలని చూడడం, భారీ ఎత్తున అప్పులు చేయడం.. వంటి అంశాలు కూడా.. జగన్ విషయంలో జనాలకు ఉన్న అనుమానాలు.
ఇవే.. ఎన్నికల వేళ ఆయనకు పెను శాపంగా మారాయి. అయినా.. నిఖార్సుగా ఆయన స్పందించింది లేదు. సమగ్ర వివరాలతో మీడియా ముందు వివరణ ఇచ్చింది కూడా లేదు.
ఇప్పుడు రుషికొండపై భారీ ఎత్తున అనుమానాలు పెరిగిపోయిన దరిమిలా.. పన్నెత్తు మాట మాట్లాడడం లేదు. ఇదంతా చూస్తే.. జగన్ ధైర్యం అనుకోవాలా? లేక.. మొండితనం అనుకోవాలో.. వైసీపీ నేతలకు అర్ధం కావడం లేదు.
కానీ, ఈ మౌనం మాత్రం మొత్తానికే మరింత బ్యాడయ్యేలా చేస్తుంది. కొన్ని దశాబ్దాల పాటు.. ఆయనను ప్రతిపక్షానికే పరిమితంచేసినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని.. ఏం జరిగిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పై ఉంది. లేకపోతే.. ఆయనకే కాదు.. ఆయనను నమ్ముకున్న నాయకులకు కూడా.. ప్రజలు మరింత దూరమయ్యే పెను ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 20, 2024 11:38 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…