మరో పది రోజుల్లో రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యో గులకు వేతనాలు ఇవ్వాలి. వీటితోపాటు.. రిటైరైన ఉద్యోగులకు కూడా.. పింఛన్లు ఇవ్వాలి. వీటి పద్దు కోసం రమారమి.. 10 వేల కోట్ల రూపాయలు తక్షణ అవసరం కింద చంద్రబాబు ప్రభుత్వానికి కావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఖజానాలో 2 వేల కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్యలోనే నిధులు ఉన్నాయి. దీంతో 1వ తారీకు గండం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం తంటాలు పడుతోంది.
ఇలా ఎందుకు జరిగిందనే సర్కారుకు అంతుచిక్కడం లేదు. వాస్తవానికి డైలీ ఖర్చుల కింద సర్కారుకు రూ. 20-50 లక్షల మధ్య ఖర్చవుతుంది. ముఖ్యమంత్రి పర్యటనలు, మంత్రుల పర్యటనల ఖర్చు.. సమీక్ష ల ఖర్చులు.. ప్రభుత్వ నిర్వహణ వంటివాటికి ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. ఇవి ఏ ప్రభుత్వం ఉన్నా.. అయ్యేదే. అయితే.. రోజు వారీ ఆదాయం 5-10 కోట్ల వరకు వస్తుంది. రిజిస్ట్రేషన్లు.. పన్నుల వసూళ్లు బాగుంటే ఈ మొత్తం అందుతుంది. కానీ, గత సర్కారు కారణంగా ఇది 3 కోట్ల కు పడిపోయింది.
దీంతో ప్రభుత్వ రోజు వారి ఖర్చులు.. ఇతరత్రా పథకాలకు సంబంధించి ప్రతి మంగళవారం.. జగన్ సర్కారు అప్పట్లో అప్పులు చేసింది. అయితే.. ఎన్నికల ముందు వరకు ఇలా అప్పులు చేయడంతో సర్కారుకు ఇప్పుడు అప్పులు పుట్టే అవకాశం కూడా లేదు. రాష్ట్ర జీడీపీని అనుసరించి.. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. దీని ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఆరు మాసాల వరకు అంటే.. సెప్టెంబరు వరకు 47 వేల కోట్ల రూపాయలను అప్పు చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
దీనిలోనూ జగన్ ఉన్న ఏప్రిల్ , మే నెలలోనే మెజారిటీ అప్పులు తెచ్చేశారు. అప్పు రూపంలో కేంద్రం ప్రతిపాదించిన 47 వేల కోట్ల రూపాయల్లో జగన్ సర్కారు 25 వేల కోట్ల ను తెచ్చేసింది. ఈ నిధులను కూడా.. కొందరు కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించేసింది. దీంతో అప్పుల రూపంలో ఇక, మిగిలింది 22 వేల కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా ఇప్పటికిప్పుడు ఇస్తారో లేదో తెలియదు. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం ప్రయత్నిస్తోంది.
వచ్చే 1వ తారీకు నాటికి 10 వేల కోట్లు పంపిణీ చేయడం ద్వారా(పింఛన్లు, జీతాలు) చంద్రబాబు తన మార్కును చూపించాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన తంటాలు పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆసారి సామాజిక భద్రతా పించన్లను రూ.7000 చొప్పున పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే.
This post was last modified on June 20, 2024 11:14 am
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…