ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు గుర్తింపు సంపాదించిన నేత.. ముద్రగడ పద్మనాభం. 2019లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడడంలో ఆయన పాత్ర కూడా కొంత ఉంది. టీడీపీకి వ్యతిరేకంగా కాపులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన ప్రయత్నం కొంతమేర ఫలించింది. కానీ ఈసారి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే ధ్యేయంగా పని చేసి బొక్క బోర్లా పడ్డారు.
పవన్ కళ్యాణ్‌ను ఓడించాలంటూ పిఠాపురం ప్రజలకు ఆయన ఇచ్చిన పిలుపు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల ముంగిట పవన్‌ను ఓడించకుంటే తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకుంటానంటూ ఆయన చేసిన సవాల్‌తో అభాసుపాలైపోయారు. ఇదేం సవాల్ అని జనాలు ముక్కున వేలేసుకున్నారు.
కట్ చేస్తే ఎన్నికల్లో పవన్ కళ్యాణే కాదు.. జనసేన అభ్యర్థులందరూ కూడా తిరుగులేని విజయం సాధించారు. దీంతో ముద్రగడ పరువు పోయింది. ఐతే రాజకీయ నాయకులు ఎన్నికల ముంగిట ఇలాంటి సవాళ్లు చేయడం.. తర్వాత చప్పుడు చేయకుండా ఉండిపోవడం మామూలే. కానీ ముద్రగడ మాత్రం తన సవాల్‌కు కట్టుబడ్డారు. తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి కొన్ని రోజుల కిందటే అధికార ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ప్రకియ అంతా పూర్తయి ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది.
ముద్రగడ పద్మనాభం పేరు ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మారినట్లు ఇందులో పేర్కొన్నారు. ఇక నుంచి ఆయన్ని అందరూ ‘పద్మనాభరెడ్డి’గానే పిలవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఉదయం నుంచి ఈ వార్తే హాట్ టాపిక్‌గా మారింది. పేరు మార్పు సవాల్ విషయంలో ముద్రగడ ఇంత పట్టుదలకు పోయారేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on June 20, 2024 11:05 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…