విశాఖపట్నం జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిన ప్యాలెస్ నిర్మాణంపై విమర్శలు ప్రతి విమ ర్శలు కూడా వచ్చాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యదుమారం కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ విసయంలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల జోక్యం చేసుకున్నారు. రుషి కొండ నిర్మాణాలు అక్రమమని భావిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని సర్కారును కోరారు. తాజాగా ఆమె స్పందిస్తూ.. రుషికొండ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇక, తాను ఓడిపోవడానికివైసీపీనే కారణమని వ్యాఖ్యానించారు. కడపలో సిట్టింగ్ ఎంపీ డబ్బులు పారించా రని.. దీనికి తోడు బెదిరింపులకు కూడా గురి చేశారని..అందుకే తాను ఓడిపోయానని చెప్పారు. హంతకు లు పార్లమెంటుకు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే తాను పోటీ చేసినట్టు ఆమె వివరించారు. అయితే.. ప్రజలు వైసీపీకి భయపడే పరిస్థితిని కల్పించారని చెప్పారు. ఇప్పుడు వైసీపీ బుట్టదాఖలైందని.. ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని అన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు కాలం నడుస్తోందని షర్మిల అన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు నిలబడడానికి చంద్రబాబే కారణమని.. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంటు.. విభజన చట్టంలోని అంశాలను రాబట్టుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయాలని చెప్పారు. అయితే.. ఇప్పుడే తాము ఒత్తిడి చేయబోమని.. కొంత సమయం ఇస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజలు గుర్తించారని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రె స్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకును సీట్లను కూడా పెంచుకుంటామన్నారు. వైసీపీ ఓడిపోయినా.. ఆ పార్టీ నాయకులకు ఇంకా తెలివి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నట్టు షర్మిల చెప్పారు.
This post was last modified on June 19, 2024 10:12 pm
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…