ఒక్క ఓటమి ఒకే ఒక్క ఓటమి.. వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్‌ను మానసికంగానే కాకుండా.. ఇమేజ్ పరంగా కూడా దెబ్బేసేసిందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చిన తర్వా త.. కూడా జగన్ వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే. సిమెంటు, కరెంటు సహా.. మీడియా రంగంలోనూ ఆయన వ్యాపారాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు.. రాజకీయాల్లోకి రాకముందు కూడా.. అవి నిర్విఘ్నంగా సాగాయి. ఇక, అధికారపక్షంలోకి రావడంతో వ్యాపారాలు పంజుకున్నాయి.
గత ఐదేళ్లలో జగన్ మీడియా సంస్థలు సాక్షి పత్రిక, చానెళ్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. ప్రభుత్వం నుంచి అందిన దన్ను.. ప్రజల నుంచి వచ్చిన మద్దతుతో పత్రిక సర్క్యులేషన్ పెరిగిపోయింది. అదేసమయంలో సర్కారు నుంచి యాడ్స్ రూపంలోనూ కోట్లకు కోట్ల రూపాయల సొమ్ములు వచ్చాయి. ఇక, సిమెంటు వ్యాపారం కూడా.. పుంజుకుంది. విద్యుత్ రంగంలోనూ సొమ్ములు బాగానే అందాయి. లాభాలు కనిపించాయి. దీంతో ఇక తిరుగులేదని అనుకున్నారు. విస్తరణకు కూడా ప్లాన్‌చేశారు.
కానీ, తాజాగా జరిగిన ఎన్నికల్లోవైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేక పోయింది. దీంతో ఈ ప్రభావం వైసీపీ అధినేత జగన్‌పై వ్యక్తిగతంగానే కాకుండా.. వ్యాపార పరంగా కూడా ప్రభావం చూపిస్తోంది. ఎన్నికల వరకు.. 14 లక్షలుగా ఉన్న సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఇప్పుడు ఒక్కసారిగా 10 లక్షల చిల్లరకు పడిపోయింది. యాడ్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో పత్రికలో సిబ్బందిని తగ్గించే ప్లాన్ చేస్తున్నారు.
ఇక, సిమెంటు, కరెంటు వ్యాపారాలు కూడా.. సగానికి సగం పడిపోయాయి. ముఖ్యంగా భారతి సిమెంటును కొనుగోలు చేసేందుకు గతంలో పొరుగు రాష్ట్రాలు ఇంట్రస్ట్ చూపించాయి. వైసీపీ సర్కారుతో పనులు ఉన్న నేపథ్యంలో దీనిని కొనుగోలు చేశారనే విమర్శలు తెలంగాణలోనూ వినిపించాయి. అయితే..ఏపీలో సర్కారు మారడంతో అదే ప్రభావం ఇప్పుడు రివర్స్ అవుతుందని అంచనా వేసి.. దీనికి సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేసుకుంటున్నాయి.
ఉత్తరాఖండ్‌లో విద్యుత్ సంస్థల నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయని సమాచారం. దీంతో జగన్‌ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఏదేమైనా ఒక్క ఓటమి ఆయన వ్యాపారాలపైనా ప్రభావం చూపించడం గమనార్హం. ఇక, ఇదేసమయంలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ చైన్ బిజినెస్ పుంజుకుంది. షేర్లు స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
This post was last modified on June 19, 2024 9:34 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…