ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం, స్పీకర్ ఎంపిక కోసం ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై వెళ్లడంతో జూన్ 24 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను నిర్వహించాలని అనుకున్నారు.
కానీ, తాజాగా ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 21, 22 తేదీలలో శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజులపాటు జరగబోయే సమావేశాలలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంపిక లాంఛనమే అని తెలుస్తోంది. ఇక, జనసేన నుంచి డిప్యూటీ స్పీకర్ గా లోకం మాధవిని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్ గా పొన్నూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్రను నియమించబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
This post was last modified on June 18, 2024 6:04 pm
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…