Political News

జాగ్ర‌త్త ప‌డుతున్న జ‌గ‌న్..

ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బొక్క బోర్లా ప‌డ్డా వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇన్నాళ్ల‌కు వాస్త‌వం గ్ర‌హించారు. పార్టీ అంటే.. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాలు కాద‌ని.. పార్టీ అంటే.. నాయ‌కుల‌ని ఆయ‌న గుర్తించిన‌ట్టున్నారు. ఈ క్ర‌మంలోనే నాయ‌కులను కాపాడుకునేందుకు తంటాలు ప‌డుతున్నారు. తాజాగా పార్టీ నేత‌ల‌తో విస్తృత స్థాయి స‌మావేశానికి జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఈ నెల 19న తాడేప‌ల్లి లోని క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ నాయ‌కుల‌తో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు పోటీ చేసి ఓడిన అభ్యర్ధులందరినీ కూడా ఆహ్వనించారు.

వీరితో పాటు పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించారు. అంద‌రూ విదిగా హాజ‌రు కావాలంటూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో జ‌గ‌న్ వారిని ప‌క్క చూపులు చూడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం పార్టీలో నాయకులు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేసుకుంటున్నారు. వ‌చ్చే ఐదేళ్లు కూడా.. పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితి ఎదురు కానుంది. ఇది త‌ప్ప‌దు. క‌క్ష పూరిత రాజ‌కీయాలు, కుట్ర పూరిత రాజ‌కీయాలు లేక‌పోయినా.. వారు గ‌తంలో చేసిన నిర్వాకాల‌పై విచార‌ణ‌లు, చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు ఉంటాయ‌నే చ‌ర్చ సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీలో ఓడిపోయి.. వివాదాల‌కు కేంద్రంగా ముద్ర‌ప‌డిన నాయ‌కులు ప‌లువురు.. త‌మ ఇల్లు చ‌క్క‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు.. ఏవైనా కూడా.. నాయ‌కులు ఇప్పుడు వైసీపీలో ఉంటే సేఫ్ కాద‌ని భావిస్తున్నారు. దీంతో పార్టీ మార్పు దిశ‌గా అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు చేస్తున్నారు. దీనిని ప‌సిగ‌ట్టిన‌.. వైసీపీ అధిష్టానం.. చేతనైనంత వ‌ర‌కు పార్టీ నాయ‌కుల‌ను కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. గ‌తంలో పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం అంటే.. ఏళ్ల‌కు ఏళ్లు స‌మ‌యం తీసుకున్న జ‌గ‌న్‌..ఇప్పుడు పార్టీ ఓడిన 15 రోజుల్లోనే ఈ త‌ర‌హా స‌మావేశం ఏర్పాటు చేయ‌డం వెనుక పార్టీ నేత‌ల‌ను నిల‌బెట్టుకోవ‌డ‌మే అజెండా అనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

This post was last modified on June 18, 2024 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు చెప్పిందిదే…

టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…

4 minutes ago

పోలిశెట్టి టైమింగ్…రాజుగారి పెళ్లి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…

57 minutes ago

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

మార్కెటింగ్ గిమ్మిక్కులు పని చేయలేదా?

జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…

3 hours ago

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని…

4 hours ago

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…

4 hours ago