ఏపీలో కొత్త ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత, కూటమి పార్టీల ఉమ్మడి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదొక అద్భుత ఘట్టం. సుమారు నాలుగు సంవత్సరాల కష్టానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. అయితే.. ఆవెంటనే చంద్రబాబు సర్కారుకు ప్రధాన సవాల్ వచ్చింది. జూలై 1న ఆర్థిక రూపంలో ఇది ముందుకు వచ్చింది. ఇది అంత తేలిక విషయం కాదు. ఏదో మాట మాత్రం చెప్పే సవాల్ కూడా కాదు. అత్యంత కీలకమైన సవాల్. పైగా చంద్రబాబు ఇచ్చిన కీలక హామీకి సంబంధించిన సవాల్.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెప్పిన హామీ.. ఇప్పటి వరకు ఇస్తున్న సామాజిక పింఛన్‌ను రూ.4000లకు పెంచుతామని. అంతేకాదు.. రాష్ట్రంలో ఏప్రిల్ మాసం నుంచి కూడా రూ.1000 చొప్పున పెంచి ఇస్తామని కూడా చంద్రబాబు తెలిపారు. ఆయనే వీటిని లెక్కగట్టి.. ఒక్కొక్కరికీ రూ.3000 చొప్పున అదనంగా కలిపి ఇస్తామన్నారు. అంటే ఒక్కొక్కరికీ రూ.7000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే మరోహామీ కూడా.. చంద్రబాబు ఇచ్చారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించబోమన్నారు. అంటే.. ప్రస్తుతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్న 64.5 లక్షల మందిలో ఎవరినీ తగ్గించడానికి వీల్లేదు. తగ్గిస్తే.. ఇదొక గగ్గోలు ఖాయం.
దీంతో ఇంత మందికి రూ.7000 చొప్పున పింఛన్లను కేవలం 18 రోజుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రానికి అప్పుగా రానున్న రూ.2000 కోట్లను చూసుకుంటే.. ఏమాత్రం దీనికి సరిపోదు. ఎందుకంటే.. ప్రతి నెలా వైసీపీ ప్రభుత్వం రూ.2వేల కోట్లకుపైగానే.. పింఛన్లకు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు తొలినెలలో ఇవి రెట్టింపు అవుతున్నాయి. అంటే.. ఎంత లేదన్నా.. చంద్రబాబు సర్కారుకు రూ.10 నుంచి 12 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఇంత మొత్తం కేంద్రం నుంచి ఎలా తీసుకువస్తారు? అనేది ప్రశ్న. ఎందుకంటే.. కేంద్రంలో కూటమిగా ఉన్న టీడీపీ ఉంది కనుక.. వడ్డించేవాడు మనవాడే కనుక సాధ్యమనే వాదన ఉన్నా.. ఏమేరకు సాధ్యమనేది ప్రధాన ప్రశ్న.
కేంద్రం నుంచి ఏపీకి ఏమేరకు సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చినా.. కూటమి పార్టీలు కూడా పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకవేళ 5000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినా.. ఆ మేరకు మోడీ సాయం చేస్తారా? అనేది చూడాలి. ఇక, ఏపీలో ఉన్న సొమ్ము ఏమైనా రూ.5000 కోట్ల మేరకు జమ అవుతుందా? అది కూడా కష్టమే. ఎలా చూసుకున్నా.. జూలై 1 నాటికి రూ.10 నుంచి 12 వేల కోట్లను కూడగట్టి పింఛన్ల రూపంలో ఇవ్వడం.. బాబుకు ఫస్ట్ సవాల్‌గా మారింది. ప్రస్తుతం ఈ విషయంపైనే ఆర్థిక శాఖ అధికారులతో చంద్రబాబు రెండో రోజే భేటీ అయ్యారు. నిధుల సమీకరణపై ఆయన మంతనాలు చేశారు.
This post was last modified on June 17, 2024 11:00 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…