టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక కార్యాచరణ దిశగా వడివడి అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా దీర్ఘకాలం పాటు పట్టే ప్రాజక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహరణకు సాగు నీటి ప్రాజెక్టులు.. పూర్తయ్యేందుకు కనీసంలో కనీసం.. రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోగా తుఫానులు.. వరదలు వంటివి వస్తే.. మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వీటిని ఇప్పటి నుంచే చేపట్టడం ద్వారా.. సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
ప్రధానంగా పోలవరం.. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా… ఉత్తరాంధ్ర నుంచి కోస్తా జిల్లాల వరకు కూడా సాగు నీటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. ఇదేసమయంలో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్నా.. ఏ ప్రభుత్వమూ పూర్తిచేయలేక పోయిందనే వాదనను తుడిచిపెట్టేసేందుకు కూడా సాధ్యమవుతుంది. అందుకే చంద్రబాబు సోమవారం.. సోమవారం ఆ ప్రాజెక్టు పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. తద్వారా పనులు వేగంగా జరుగుతాయని ఆయన ఆశిస్తున్నారు.
ఇక, కడప ఉక్కు పరిశ్రమకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టును కూడా.. ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కేంద్రంలో గనుల శాఖ సహాయ మంత్రిగా ఏపీకి చెందిన నాయకుడే ఉన్న నేపథ్యంలో ఈ పనులు త్వరగా పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా.. కడప సహా సీమలో నిరుద్యోగం కొంత వరకు తగ్గడంతోపాటు.. పార్టీకి కూడా మంచి ఊపు వస్తుంది. ఇదేసమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా కూడా … చూడాలని నిర్ణయించారు.
ముఖ్యంగా వచ్చే 100 రోజుల్లో కీలక సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ద్వారా.. భవిష్యత్తులో పార్టీకి.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే కార్యాచరణకు చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. ఏదో ఎన్నికలకు ముందు ప్రాజెక్టులను చేపట్టడం కాకుండా.. ముందుగానే వీటిని పూర్తి చేయడం ద్వారా.. ప్రజల్లో మేలైనా ఆశావహాన్ని సాధించవచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైర్‌లో కూర్చున్న వెంటనే చంద్రబాబు రాష్ట్ర ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే.. ఇక, ఏపీకి సాగునీటి రంగంలో ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోతాయి.
This post was last modified on June 17, 2024 10:53 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…