Political News

ఏపీ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ బ‌హిరంగ లేఖ‌..!

ఏపీ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర డిప్యూటీ ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌హిరంగ లేఖ రాశారు. త్వ‌ర‌లోనే తాను బాధ్య‌త‌లు చేప‌డ‌తాన‌ని అన్నారు. ఈ సేవ చేసే భాగ్యంత‌న‌కు క‌ల్పించిన ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ధ‌న్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్య‌మంత్రిగా కంటే..ఒక ఎమ్మెల్యేగానే తాను సేవ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పారు.

ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప‌ద‌విని స్వార్థం కోసం ఎట్టి ప‌రిస్థితిలోనూ వినియోగించుకునేదిలేద‌న్న ఆయ‌న‌.. త‌న‌కు ఇష్ట‌మైన శాఖ‌లు కేటాయించిన‌.. సీఎం చంద్ర‌బాబుకు కూడా.. కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ముఖ్యంగా అట‌వీ సంప‌ద‌ను దోచుకున్న‌వారితో సొమ్ముల‌ను తిరిగి రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు.

“ఎంత‌టివారైనా.. అడ‌వి త‌ల్లిని దోచుకున్న‌వారు ఎక్క‌డున్నా వ‌దిలి పెట్ట‌ను” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక‌, త‌న వారాహి యాత్ర సంద‌ర్భంగా అనేక స‌మ‌స్య‌ల‌ను క‌ళ్లారా చూసిన‌ట్టు చెప్పారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతాన‌ని తెలిపారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతాన‌ని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మాత్ర‌మే పండే ఎర్రచందనాన్ని ప‌రిర‌క్షించే బాధ్య‌త‌ను త‌న భుజాల‌పై వేసుకుంటాన‌ని తేల్చి చెప్పారు. “అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే” అని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ హెచ్చరించారు.

అనుభ‌వాలు ఇవీ..

  • విశాఖ మన్యం ప్రాంతంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను స్వయంగా చూశా. వారి క‌ష్టాలు తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తా.
  • పర్యావరణం జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల్లో భాగం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. కాబ‌ట్టి ప‌ర్యావ‌ర‌ణ మంత్రిగా కూడా దానిని ప‌రిర‌క్షించే బాధ్య‌త తీసుకుంటా.
  • గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తా. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత ఆవశ్యం. ఆదిశ‌గా వాటిని కూడా అభివృద్ధి చేస్తాం.
  • పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తాం.
  • రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టి పెడ‌తాం.
  • సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తాం. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

This post was last modified on June 15, 2024 8:47 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago