ఏపీలో కొత్తగా కొలువు దీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. శాఖల పరంగా మంత్రు లను కేటాయించడం.. అధికారులను తీసుకోవడం.. వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగానే పూర్తి చేశారు. ఇక, కార్యాచరణకు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం అవలంభించిన కార్యక్రమాల్లో కొన్నింటిని తప్పని సరిగా అమలు చేస్తున్నారు. అయితే.. వాటికి పేర్లను మార్చుతున్నారు.
ఉదాహరణకు ప్రతినెలా 1వ తేదీనే ఇచ్చే.. సామాజిక పింఛనును గత ప్రభుత్వం జగనన్న సురక్షా పింఛను
పేరుతో పంపిణీ చేసింది. కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దీనికి ఎన్టీఆర్ భరోసా
గా పేరు పెట్టింది. అయితే.. పంపిణీ విధానాన్ని మాత్రం మార్చలేదు. ప్రతి నెల 1న ప్రతి ఇంటికీ వెళ్లి.. ఎలా అయితేపింఛను పంపిణీ చేసేవారో.. అలానే ఇప్పుడు కూడా పంపిణీ జరుగుతుంది. కేవలం మార్పల్లా పేరులోనే. అదేవిధంగా.. మరో కీలక కార్యక్రమానికి కూడా పేరు మార్చారు.
ప్రతి సోమవారం.. జగన్ హయాంలో స్పందన
పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేం దుకు ప్రయత్నించింది. వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు ప్రయత్నించింది. సమస్య ఏదై నా స్పందనతో పరిష్కారం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఇదే కార్యక్రమం ఇదే పద్ధతిలో కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే.. పేరు మాత్రం మార్పు చేశారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక
గా మార్పు చేశారు.
అయితే.. పనితీరు.. ఇతరత్రా మాత్రం కామన్. అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు కూడా పేరును మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోమవారం నుంచి ప్రజాఫిర్యాదుల పరిష్కారం వేదిక ద్వారా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు పనితీరును మెరుగు పరుచుకోవాలని కూడా అధికారులకు, సిబ్బందికి చంద్రబాబు సూచించారు. మొత్తంగా చంద్రబాబు మార్క్ అయితే.. స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on June 15, 2024 12:52 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…