ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన దరిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం తగ్గిపోయింది. ముఖ్యంగా కొందరు నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం.. వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోయినా.. మండలిలో ఉంది.
35 మంది వరకు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బలంతోనే వైసీపీ వచ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే పరిస్థితి లేకపోయినా.. మండలిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండగా ఉన్నారు.
అయితే.. గత రెండు రోజుల నుంచి కొందరు ఎమ్మెల్సీలు.. పార్టీకి అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్సీల తో సమావేశం పెట్టి.. పార్టీకి మీరే అండగా ఉండాలని.. బలమైన వాయిస్ వినిపించాలని జగన్ చెప్పారు. అయితే.. ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు.
వీరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వీరు జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారని పార్టీ అధినేత ఒక నిర్ణయానికి వచ్చారు. చిత్రం ఏంటంటే.. గతంలో జంప్ చేసిన వారినే జగన్ మండలికి పంపించారు.
ఇప్పుడు వారు తిరికి సొంత పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. దీనికి కూడా కారణం ఉంది. టీడీపీ, కూటమి పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. మండలిలో మాత్రం అవిపేలవంగా ఉన్నాయి.
దీంతో మండలిలో ప్రభుత్వానికి వైసీపీ నుంచి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరిచినా ఆశ్చర్యం లేదు. అయితే.. ఇంకా అంత దూరం చంద్రబాబు వెళ్లలేదు. కానీ, ఈ పరిణామాలను ముందుగానే గుర్తించి.. కొందరు ఇప్పటి నుంచే వైసీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలపై … నిఘా పెంచారు. నిత్యం సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లకు ఫోన్లు చేస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఈ పనిమీదే ఉన్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్నవారు.. అసంతృప్తిలో ఉన్నవారిని ఆయన టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on June 15, 2024 11:15 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…