ఏపీలోని ప్రఖ్యాత ఆలయం.. తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) కార్యనిర్వహణాధికారి(ఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామల రావును ప్రభుత్వం నియమించింది. తక్షణం ఆయన బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. శుక్రవారం సాయంతం అత్యవసరంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ ఈవో విషయంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతస్థాయి వర్గాలతో జరిపిన చర్చల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, 1997 బ్యాచ్ కు చెందిన వివాద రహితుడు.. జే. శ్యామలరావును ఈవో పోస్టుకు ఎంపిక చేశారు.
ధర్మారెడ్డిపై వేటు!
వైసీపీ సర్కారు పాలనలో 2021లో టీటీడీ ఈవోగా నియమితులైన ధర్మారెడ్డిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ధర్మారెడ్డి ఐఏఎస్ అధికారి కాదు. ఐఆర్ఎస్ అధికారి. కేంద్ర రెవెన్యూ శాఖలో ఆయన పనిచేసేవారు. అయితే.. డెప్యుటేషన్‌పై ఏపీకి వచ్చిన ఆయన.. వైసీపీ సర్కారుతో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ ఈవో పోస్టును అప్పగించారు. అయితే..ఆయన హయాంలో టీటీడీ పవిత్ర దెబ్బతిందని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అన్యమత ప్రచారం.. టీటీడీ ఉద్యోగుల్లో కొందరు తిరుమల కొండపైనే ఆంగ్ల సంప్రదాయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వంటివి వివాదానికి దారి తీశాయి.
దీనికి తోడు.. తిరుమలలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అనేక సందర్భాల్లో కేసులు నమోదు కావడం.. కోర్టులకు కూడా వెళ్లడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా రెండు కేసుల్లో తిరుమల తిరుపతి దేవస్థా నం అధికారులను హెచ్చరించింది. ముఖ్యంగా ప్రొటోకాల్ దర్శనాల విషయంలో ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. అధికార పక్షం నేతలకు ఎక్కువగా అవకాశం ఇవ్వడం.. అప్పటి మంత్రులు రోజా, నారాయణ స్వామి వంటి వారు వందల సంఖ్యలో భక్తులను తీసుకువచ్చినా అనుమతించడం.. వంటివి ధర్మారెడ్డి పనితీరుపై విమర్శలు వచ్చేలా చేశాయి.
ఇదిలావుంటే..వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత.. ధర్మారెడ్డి కూడా అలెర్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న సంకేతాలు స్పష్టం కావడంతో ధర్మారెడ్డి తనంతట తనే.. సెలవు పెట్టారు. ముందు ఈ సెలవుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించలేదు. కానీ, చంద్రబాబు సూచనలతో ఆయనకు సుదీర్ఘ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆయనను తొలగిస్తూ.. మరో ఉత్తర్వు జారీ చేశారు. జేఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. సెలవుల అనంతరం.. ధర్మారెడ్డి జేఏడీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
This post was last modified on June 15, 2024 10:10 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…