24 మంది మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తాలను వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే చంద్రబాబు క్యాబినెట్ లో అందరూ ఉన్నత విద్యావంతులు ఉండడం విశేషం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుండి మంత్రి అయిన కందుల దుర్గేష్ కూడా ఎంఎ ఎకనామిక్స్ చదివారు. బీజేపీ నుండి మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్ ఎంఎ పొలిటికల్ సైన్స్ చదివారు. ఆయనకు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ భాషలు అనర్గళంగా వస్తాయి.
నారా లోకేష్ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్ బ్రిటన్ లో ఎంబీఎ చదివారు. నాదెండ్ల మనోహర్ ఎంబీఎతో పాటు మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివారు. పయ్యావుల కేశవ్ కూడా మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివారు. మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంజనీరింగ్ చదవగా, డోలా బాల వీరాంజనేయ స్వామి వైద్య విద్యను అభ్యసించారు.
నిమ్మల రామానాయుడు ఎంఎ, ఎంఫిల్ చదివి పీహెచ్డీ డాక్టరేట్ అందుకున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బీడీఎస్ ను మద్యలో ఆపేశారు. కొండపల్లి శ్రీనివాస్ యూఎస్ లో ఎంఎస్ చదవగా, ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్రలు న్యాయవిద్యను అభ్యసించారు. పొంగూరు నారాయణ, వంగలపూడి అనితలు పీజీ పూర్తి చేశారు. సవిత, సంద్యారాణి, బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధిలు డిగ్రీ చదివారు. అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేయగా, ఎన్ఎండీ ఫరూక్ ఇంటర్ పూర్తిచేశారు.
This post was last modified on June 14, 2024 5:52 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…