ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. గ్రామీణ పాలనను పూర్తిగా అప్పగించేశారు.
పవన్‌కు కూడా.. గ్రామీణ పాలనపై అవగాహన ఉండడం. ఆయనకు కూడా.. గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టం ఉండడంతో చంద్రబాబు ఆయన మనసెరిగి కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మంత్రులకు పలు శాఖలు కేటాయిస్తూ.. చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
దీని ప్రకారం.. రాష్ట్ర పురోభివృద్ధికి కీలకమైన పంచాయతీరాజ్ వ్యవస్థను జనసేనాని చేతిలో పెట్టారు. దీం తో పాటు గ్రామీణాభివృద్ది శాఖను కూడా ఆయనకు అప్పగించారు.
ఇక, గ్రామీణ నీటి సరఫరా, పర్యావర ణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్‌కు అప్పగించారు. ఆయా శాఖలన్నీ కూడా.. అత్యం త కీలకమైనవి.. ప్రాధాన్యం సంతరించుకున్నవే కావడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది చేసేందుకు మెజారిటీ స్కోప్ ఉంది.
రాజకీయంగా కూడా.. పవన్ తన ఇమేజ్ ను పెంచుకునేందుకు ఈ శాఖలను వినియోగించుకునేందుకు కూడా అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాలను, ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తే.. పవన్ పేరు, పార్టీ కూడా మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు.
అదేసమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను అప్పగించడం ద్వారా. యువతకు నైపుణ్యాభివృద్ధి సమకూర్చడంలోనూ పవన్ కీలకంగా మారనున్నారు. తద్వారా.. యూత్‌లోనూ ఆయనకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది.
సో.. ఎలా చూసుకున్నా.. ఒక వైపు ప్రభుత్వ బాధ్యతను నిర్వహిస్తూనే మరోవైపు.. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కూడా.. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ .. ఇటు యువతలోనూ .. కూడా పేరు తెచ్చుకునేందుకు పవన్‌కు అవకాశం ఏర్పడిందనడంలో సందేహం లేదు. పనితీరు.. ఉత్సాహం మెండుగా ఉన్న పవన్‌కు చేతి నిండి బాధ్యతలు అప్పగించారనే చెప్పాలి.
This post was last modified on June 14, 2024 5:08 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…