శ్రీ లక్ష్మి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఐఏఎస్ అధికారిణి. వైఎస్ హయాంలో ఆమె అడ్డగోలుగా వ్యవహరించి ముఖ్యమంత్రి తనయుడైన జగన్‌కు మేళ్లు చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తెలిసిందే.
అవినీతి కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం కూడా అనుభవించారామె. ఐతే అంత జరిగాక కూడా శ్రీలక్ష్మిలో ఏ మార్పూ రాలేదనే చర్చ జరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమెకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చారు.
గత ఐదేళ్లలో ఆమె వ్యవహార శైలి, తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఒక పెద్ద పతనం తర్వాత మళ్లీ ఆమె గత ఐదేళ్లలో వైభవం చూశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగింది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మామూలుగా చంద్రబాబుకు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టరనే అభిప్రాయం ఉంది.
తాను మెచ్చిన అధికారులకు ప్రయారిటీ ఇస్తారే తప్ప.. ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను పనిగట్టుకుని టార్గెట్ చేయరని చంద్రబాబుకు ఒక పేరుంది. కానీ బాబు ఈసారి భిన్నంగా వ్యవహరించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రకటన చేసిన ఆయన.. జగన్ హయాంలో హద్దులు దాటి ప్రవర్తించిన అధికారులకు చుక్కలు చూపించబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తనను అభినందించడానికి అధికారులు క్యూ కట్టగా.. అందులో శ్రీలక్ష్మి కూడా ఉన్నారు. ఆమె బాబుకు బొకే ఇవ్వబోతే ఆయన తిరస్కరించడం, శ్రీలక్ష్మి నవ్వుతూ వెళ్లిపోవడం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చూసి బాబు మారిపోయారని.. జగన్ హయాంలో తమ పరిధి దాటి వ్యవహరించిన అధికారులకు తిప్పలు తప్పవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on June 14, 2024 4:52 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…