రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండ్లు ఓడలు .. ఓడలు బండ్లు అవుతాయి. అయిదేళ్ల క్రితం 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 135, భాగస్వామ్య పక్షాలతో కలిపి ఏకంగా 164 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా కూటమి 21 లోక్ సభ స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 4 స్థానాలకు పరిమితం అయింది.
ఆంధ్రాలో జరిగిన రాజకీయ అధికార మార్పిడి నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
టెక్కలి శాసనసభ్యుడుగా వరసగా మూడోసారి విజయం సాధించిన కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా, శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన అచ్చెన్నాయుడు సోదరుడు, దివంగత ఎర్రంనాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
టెక్కలి శాసనసభ స్థానం నుండి అచ్చెంన్నాయుడు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై 34435 ఓట్ల మెజారిటీతో, శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై 327901 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాదించారు. ఈ విషయం ఇలా ఉంటే ఎర్రంనాయుడు అల్లుడు, రామ్మోహన్ నాయుడు బావ ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ శాసనసభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ పై ఏకంగా 71404 ఓట్లతో విజయం సాధించడం విశేషం.
This post was last modified on June 14, 2024 3:35 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…