Political News

జ‌గ‌న్.. ‘ప్ర‌జాయాత్ర‌’ ఎప్ప‌టి నుంచంటే!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప్ర‌జాబాట ప‌ట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ నెల 4న వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీచిత్తుగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితం అయింది. నిజానికి ఇది 2019 ఎన్నిక‌ల ఫ‌లితంతో పోల్చుకుం టే ఘోర ప‌రాభ‌వం. అప్ప‌ట్లో 151 సీట్లు రాగా.. ఇప్పుడు 11కు ప‌రిమితం అయిపోయింది. దీంతో పార్టీని గాడిలో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న‌కు వ‌చ్చింది.

తాజాగా ఆయ‌న గ‌త నాలుగు రోజుల నుంచి ప్రాంతాల వారీగా ఓడిపోయిన నాయ‌కుల‌ను పిలిపించుకుని త‌న క్యాంపు కార్యాల‌యాన్నే పార్టీకార్యాల‌యంగా మార్చుకుని చ‌ర్చిస్తున్నారు. అంద‌రికీ ధైర్యం చెబుతున్నారు.

ఇదేస‌మ‌యంలో ప్ర‌లోభాల‌కు లొంగ‌వ‌ద్ద‌ని కూడా.. సూచిస్తున్నారు. గురువారం పార్టీ ఎమ్మెల్సీ ల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇత‌ర పార్టీల నుంచి ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని.. వాటిని న‌మ్మొద్ద‌ని తెలిపారు. పార్టీ మారొద్ద‌ని కూడా.. వేడుకున్నారు.

ఇక‌, ఈ ప‌రాజ‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్‌.,. ఎక్క‌డో ఏదో జ‌రిగింద‌ని భావి స్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఆధారాలు లేకుండా ఎవ‌రిపైనా తాను విమ‌ర్శ‌లు చేయ‌ద‌లుచుకోలేద‌ని తెలిపారు.

ఏదేమైనా ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును శిరసా వ‌హించాల్సిన బాధ్య‌త వైసీపీపై ఉంద‌ని చెప్పారు. ఇక‌, పార్టీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మకంపోయింద‌న్న విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న కొట్టి పారేశారు. ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు 40 శాతం మేర‌కు వైసీపీతోనే ఉన్నార‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

ఎందుకంటే.. తాజా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా.. ఓటు బ్యాంకు మాత్రం 39.98 శాతం వైసీపీకి ద‌క్కింది. దీనిని దృష్టిలో పెట్టుకునే జ‌గ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, తాను త్వ‌ర‌లోనే ప్ర‌జాయాత్ర‌కు సిద్ధం అవు తున్న‌ట్టు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా త‌న ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తాన‌ని.. ప‌రిస్థితుల‌పై త‌న పోరాటం ఆగ‌ద‌ని వెల్ల‌డించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఖ‌చ్చితంగా ఇబ్బందులు ఉంటాయ‌ని తెలిపారు. వీటిని అంద‌రూ త‌ట్టుకుని ముందుకు సాగేందుకు పార్టీప‌రంగా అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

This post was last modified on June 14, 2024 3:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

7 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

6 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago