Political News

ఐఏఎస్ లకు క్లాస్ తీసుకున్న బాబు

“ప్ర‌భుత్వాలు శాశ్వ‌తం కాదు. అధికారులుగా మీరు 30 ఏళ్ల‌పాటు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తారు. కానీ, గ‌డిచిన ఐదేళ్ల‌లో మీరు ఎవ‌రికి చేశారో.. ఎందుకు అలా చేశారో.. ఎవ‌రిని అణిచేశారో..ఎందుకు అణిచేశారో.. ఒక్క సారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోండి” అని ఏపీలో కీల‌క‌మైన ఐఏఎస్‌, ఐపీఎస్ ఉన్న‌తాధికారుల‌కు నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హిత‌వు ప‌లికారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఉన్నతా ధికారుల‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

సుమారు గంట‌కుపైగానే వారితో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గ‌త ఐదేళ్ల‌లో ఎవ‌రెవ‌రు ఎలా వ్య‌వ‌హరించారో పేరు పేరున వివ‌రించారు. గడచిన ఐదేళ్లలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందని చెప్పారు. అంతేకాదు.. ప్ర‌భుత్వాలు ఏవైనా అధికారులు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ఈ నేప‌థ్యంలో గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని హిత‌వు ప‌లికారు.

“నేను ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా ఏమీ అనాల‌ని అనుకోవ‌డం లేదు. కానీ, మీకు మీరే ఆలోచించుకోండి. ఎవ‌రు ఎలాంటి వ్య‌వ‌హారాలు చేశారో.. ఇంత‌క‌న్నా చెప్ప‌ను. చెప్పాల్సి వ‌చ్చే ప‌రిస్థితిని మీరు తెచ్చుకున్నా.. ఉన్న‌తాధికారులుగా మీపై నాకున్న అభిప్రాయం మేర‌కు .. నేను చెప్ప‌దలుచుకోలేదు. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఇక‌, మీద‌ట త‌ప్పులు చేయ‌కుండా సుప‌రిపాల‌న అందించేందుకు స‌ర్కారుతో క‌లిసి ప‌నిచేయండి. ఎవ‌రికి వ్య‌క్తిగ‌త అజెండాలు ఉండడానికి వీల్లేదు” అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో పాల‌న‌ను గాడిలో పెట్టేందుకు ఐఏఎస్‌లు పూర్తిస్థాయిలో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. గ‌తంలో మాదిరిగా అంతా బాగుంద‌నే చ‌ర్చ త‌న వ‌ద్ద పెట్ట‌వ‌ద్ద‌ని.. స‌మ‌స్య ఏదైనా ప‌రిష్కారానికి నిర్దిష్ట గ‌డువు పెట్టుకుని దాని ప్ర‌కారం ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఇక‌, రాష్ట్రంలోశాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు ఐపీఎస్‌లు ఉమ్మ‌డిగా ప‌నిచేయాల‌న్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు బాగుంటేనే పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు త‌ర‌లివ‌స్తాయ‌ని.. ఈ విష‌యంలో మీరు ఎంత వ‌ర‌కు చేయ‌గ‌ల‌రో అంత‌వ‌ర‌కు చేయాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఈ స‌మావేశంలో ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారులు మౌనంగా ఉండిపోయారు. ఒక్క‌రు కూడా నోరువిప్పి మాట్లాడ‌లేదు.

This post was last modified on June 14, 2024 3:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

1 hour ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago