ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేపు సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు
అయితే బాధ్యతల స్వీకరణ సంఘర్షణగా మొదట ఏ ఫైళ్లపై సంతకాలు చేస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ వీడింది. మొదట మూడు ఫైళ్ల మీద సంతకం అని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది.
అయితే మొత్తం ఐదు ఫైల్స్‌పై చంద్రబాబు సంతకాలు చేయనున్నారని, అందుకు సంబంధించిన దస్త్రాలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
మెగా డీఎస్సీపై మొదటి సంతకం,
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం,
అన్న క్యాంటీన్‌ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్‌పై ఐదో సంతకం చేయనున్నారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుంటారు.
This post was last modified on %s = human-readable time difference 11:18 am
మాములుగా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా ఒక వారం రోజులు స్ట్రాంగ్ గా నిలబడితే బ్లాక్ బస్టర్ గా…
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న బాలయ్య 109 టైటిల్ టీజర్ ఈ వారమే విడుదల కానుంది. ఉదయం 10…
దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…