పయ్యావుల కేశవ్. 1994లో ఎన్టీఆర్ పిలుపుతో 29 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. స్వతంత్ర అభ్యర్థి శివరామిరెడ్డి మీద విజయం సాధించాడు. ఆ తర్వాత 1999లో పయ్యావుల ఓటమి పాలయ్యాడు.
ఇటీవల గెలుపుతో పయ్యావుల ఉరవకొండలో 5 సార్లు విజయం సాధించాడు. అయితే గత ఇరవై ఏళ్లుగా పయ్యావుల గెలిస్తే పార్టీ ఓడిపోతుంది. పయ్యావుల ఓడితే పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ మొదలయింది.
ఇటీవల ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని పయ్యావుల చెబుతూ వచ్చాడు. అన్నట్లు గానే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి మీద పయ్యావుల 21 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించాడు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 30 ఏళ్లకు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. గత 30 ఏళ్లలో జరిగిన ఏడు ఎన్నికలలో పయ్యావుల అయిదు సార్లు విజయం సాధించాడు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి 1994 ఎన్నికల్లో పయ్యావుల తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1999 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలుపొందారు.
టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో పయ్యావుల ఓటమి చెందారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో కేశవ్ గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. కూటమి అధికారంలోకి వచ్చింది.
1997 నుంచి 1999 వరకూ టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, 2002-09 వరకూ పార్టీ విప్‌గా, 2009-12 వరకూ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్ కమిటీ మెంబర్‌గా, 2004-14 వరకూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన 2015లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ప్రభుత్వ చీప్ విప్‌గా పనిచేశారు. 2019 నుంచి పీఏసీ చైర్మనగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయంతో చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి సాధించారు. 1985లో ఉరవకొండ నుండి గెలిచిన గుర్రం నారాయణప్ప అప్పటి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. ఆ తర్వాత 39 ఏళ్లకు ఉరవకొండ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కడం విశేషం.
This post was last modified on June 13, 2024 11:06 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…