టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ఎత్తుగడల ఫలితంగా తెలంగాణలో ప్రతిపక్షం జాడ వెతుక్కునే పరిస్థితి ఉందనే సంగతి తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ గులాబీ గూటికి చేరిపోగా కొందరు మాత్రమే పార్టీకి కట్టుబడి ఉన్నారు.
ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఒకరు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే సీతక్క తీరు గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ ప్రజలకు చేసిన వివిధ సేవ కార్యక్రమాల కారణంగా ఆమె పాపులారిటీ సంపాదించారు. అయితే, ఇప్పుడు మరో ముందడుగు వేశారు.
లాక్ డౌన్ వల్ల చాలామందికి ఒక పూట తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాళ్ల ఆకలిని తీర్చేలా పేద ప్రజల కోసం మంచి ఆలోచన చేసిన సీతక్క పేదలకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటికే లాక్ డౌన్ క్రమంలో ఇంట్లో కాళీగా ఉన్న కొందరు రకరకాల ఛాలెంజ్ లతో టైమ్ పాస్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, దీనికంటే భిన్నంగా సీతక్క కొత్త ఛాలెంజ్ విసిరారు. గోహంగర్ గో పేరుతో ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో ఒకరు కొంత మంది పేదలకు ఆహారం పంపిణీ చేయాలి. వారు మరొకరికి ఇలాగే ఛాలెంజ్ చేయాలి. ఎవరికీ ఉపయోగపడని ఛాలెంజుల కన్నా ఆకలితో అలమటించేవారి ఆకలిని తీర్చే ఈ ఛాలెంజ్ మంచిదని నెటిజన్లు అంటున్నారు.
ఈ చాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కొరకరాని కొయ్యగా మారిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిలకు చాలెంజ్ విసిరిన సీతక్క తన సోదరులు ఈ చాలెంజ్ పూర్తి చేసి అన్నార్తుల కడుపు నింపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
This post was last modified on April 27, 2020 5:25 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…