ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పలువురు సీనియర్లకు క్యాబినెట్ లో స్థానం దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్యాబినెట్ లో బెర్తు ఖాయం అని ఇప్పటికే వారికి ఫలానా శాఖ దక్కుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లను పక్కన పెట్టడం విశేషం.
బాబు క్యాబినెట్ లో ఈ సారి ఖచ్చితంగా చోటు లభిస్తుందనుకున్న వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాస రావు, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమా మహేశ్వర్ రావు, గద్దె రామ్మోహన్, నందమూరు బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, GV ఆంజనేయులు, కూన రవి తదితరులు ఉన్నారు.
అలాగే వీరితో పాటు JC అస్మిత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి కొండ్రు మురళీతో పాటు రాష్ట్రం లోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాస రావులకు అవకాశం దక్కలేదు. బాబు క్యాబినెట్ లో గోరంట్లకు వ్యవసాయ శాఖ, బోండా ఉమకు భారీ నీటిపారుదల శాఖ అని ప్రచారం జరిగింది. అనంతపురం జిల్లాలో జనసేన నుండి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ యాదవ్, టీడీపీ నుండి గెలిచిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మొదటిసారి పెనుగొండ నుండి గెలిచిన సవితకు క్యాబినెట్ లో చోటు దక్కింది. కానీ మాజీ మంత్రి పరిటాల రవి సతీమణి పరిటాల సునీతకు దక్కకపోవడం విశేషం.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి వరసగా ఆరు సార్లు విజయం సాధించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ఎన్నికల్లో వరసగా ఏడోసారి 64,090 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినా క్యాబినెట్ లో చోటు దక్కలేదు. విజయవాడ సెంట్రల్ నుండి బోండా ఉమ 68886 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భీమిలి నుండి ఈ సారి 92 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినా గంటా శ్రీనివాసరావుకు స్థానం దక్కలేదు. ఇక ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలక్రిష్ణకు క్యాబినెట్ లో చోటు ఖాయం అనుకున్నారు. కానీ ఆయనకు కూడా స్థానం దక్కకపోవడం విశేషం.
సీనియర్లకు చోటు దక్కకపోవడం వెనక చంద్రబాబు వ్యూహం ఏంటి అన్నది తెలుగుదేశం పార్టీతో పాటు, ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే కొత్తవారికి అవకాశం ఇవ్వడం మూలంగా ఉత్సాహంతో పనిచేస్తారన్న ఉద్దేశంతోనే 17 మందికి చోటు కల్పించారు అన్న ప్రచారం నడుస్తుంది.
This post was last modified on June 12, 2024 1:21 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…