టీడీపీ అధినేత చంద్రబాబు తన కేబినెట్ కూర్పు, చేర్పు విషయంలో సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీల విషయంలో ఈ సారి పెద్ద అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు కూడా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. ఫలితంగా ఆయా సామాజిక వర్గాల డిమాండ్లను చంద్రబాబు నెరవేర్చినట్టు అయింది. ఎప్పటి నుంచో తమకు అవకాశం ఇవ్వాలన్న వారి డిమాండ్లను పరిష్కరించినట్టు కూడా అయింది.
కొల్లు రవీంద్ర: చంద్రబాబు కేబినెట్‌లో గతంలోనూ కొల్లు రవీంద్ర చేశారు. బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు.. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. గత వైసీపీ పాలనలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్లారు. అయితే.. తర్వాత పోరాటాలతో వ్యతిరేకతను అధిగమించిన పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు.
అచ్చెన్నాయుడు: ఉత్తరాంధ్రకు చెందిన కొప్పుల వెలమ సామాజిక వర్గం. బీసీలుగా పరిగణించే ఈ వర్గం నుంచి గతంలోనూ ఆయన మంత్రి అయ్యారు. బలమైన గళం, పార్టీని ఏపీలో నడిపిస్తున్న తీరు వంటివి అందరికీ తెలసింది. మరో సారి అవకాశం దక్కించుకున్నారు.
కొండపల్లి శ్రీనివాస్: ఉత్తరాంధ్రకు చెందిన కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి విజయం దక్కించుకున్నారు. ఈయన బీసీ తూర్పుకాపు సామాజిక వర్గం. ఈయనకు కూడా చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
సత్యకుమార్(బీజేపీ): బీజేపీకి ఇచ్చిన ఒక్క సీటు విషయంలోనూ.. చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి విజయం దక్కించుకున్న సత్య కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ఈయన కూడా బీసీ వర్గానికి చెందిన నాయకుడు. యాదవ వర్గంలో మంచి పేరు కూడా దక్కించుకున్నారు.
సత్యప్రసాద్: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వరుస విజయాలు దక్కించుకున్న నాయకుడు. గౌడ సామాజిక వర్గం నేత. ఈయనకు చంద్రబాబు తొలిసారి అవకాశం ఇచ్చారు. వీర విధేయత, స్వయంకృషికి ఈ పదవి తార్కాణమనే చెప్పాలి.
సవిత: అనంతపురం సహా.. సీమలో బీసీలుగా పరిగణించే కురబ సామాజిక వర్గానికి చెందిన సవిత తొలిసారి విజయం అందుకున్నారు. పెనుకొండ నుంచి గెలిచారు. ఈమెకు చంద్రబాబు బీసీ కోటాలోనే మంత్రి పదవి ఇచ్చారు.
సుభాష్: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి విజయం దక్కించుకున్న వాసం శెట్టి సుభాష్‌కు చంద్రబాబు మంత్రి పదవి కేటాయించారు. ఈయన బీసీ సామాజిక వర్గం శెట్టి బలిజ వర్గానికి చెందిన నాయకుడు. తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు.
This post was last modified on June 12, 2024 11:59 am
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…